ఏపీలో బీజేపీపై నిఘా పెట్టారా... తెర‌వెన‌క స్కెచ్ ఎవ‌రిది..!

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ప‌డుతూ లేస్తూ ఉంది.ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఎంత మంది అధ్య‌క్షుల‌ను మార్చినా, జీవీఎల్ లాంటి వాళ్ల‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఇచ్చినా, ఇత‌ర పార్టీల నుంచి ఎంత మంది కీల‌క నేత‌ల‌ను, ఎంపీల‌ను పార్టీలో చేర్చుకున్నా బీజేపీ బ‌లం వీస‌మెత్తు కూడా పెర‌గ‌డం లేదు.

 Specaial Eye On Bjp In Ap.. Who Is Behind This Political Sketch, Andhra Pradesh,-TeluguStop.com

సాధార‌ణంగా ఏ పార్టీ అయినా బ‌లం పెంచుకోవాలంటే ప్ర‌ధానంగా అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది.అయితే ఏపీలో ఇందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది.

ఇక్క‌డ అధికార ప‌క్షం వైసీపీతో సమానంగా బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కూడా టార్గెట్ చేస్తోంది.

ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పుల‌నే బీజేపీ నేత‌లు ఎత్తి చూపేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ విష‌యం ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్ద‌ల దృష్టికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.బీజేపీలోని కొంద‌రు నేత‌లు అధికార ప‌క్షంతో అంట‌కాగుతూ ప్ర‌ధానంగా టీడీపీని, చంద్ర‌బాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నార‌న్న అంశంపై ఆరా తీస్తున్నార‌ట‌.

ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఏపీ బీజేపీ నేత‌ల‌కు జాతీయ నాయ‌క‌త్వం కొన్ని సూచ‌న‌లు చేసినా కూడా ఏపీ బీజేపీలోని చాలామంది నేతల తీరు మారకపోవడంతో అధిష్ఠానం వారిపై నిఘా పెట్టిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలే చెపుతున్నాయి.

ముఖ్యంగా ఏపీ బీజేపీకి ద‌శ‌, దిశ నిర్దేశం చేసే నేత‌తో పాటు రాయ‌ల‌సీమ‌కు చెందిన మ‌రో నేత‌, ఢిల్లీలో వ్య‌వ‌హారాలు చూడాల్సిన నేత జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ఏపీలో ఉండ‌డంతో పాటు సాక్షి పేప‌ర్లో వైసీపీకి ఫేవ‌ర్‌గా వ్యాసాలు రాస్తున్న మ‌రో నేత‌పై నిఘా పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

వీరిలో కొంద‌రు నేత‌ల‌కు స్థిరాస్తి ప్యాకేజీలు అంద‌డంతో పాటు మ‌రి కొంద‌రికి న‌గ‌దు ప్యాకేజీలు కూడా అందాయ‌న్న విష‌యం అధిష్టానం వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌.ఈ క్ర‌మంలోనే వీరి వ్య‌వ‌హారాల‌పై కేంద్ర బీజేపీ పెద్ద‌లు నిఘా పెట్టార‌ని టాక్‌.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube