టీడీపీ నాయకుడి కి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని కొడుకు..!!- Speaker Tamminenis Son Gives Warning To Tdp Leader

Speaker Tammineni\'s son gives warning to TDP leader Tammineni, Tammineni chiranjeevi, TDP - Telugu Tammineni, Tammineni Chiranjeevi, Tdp

తెలుగుదేశం పార్టీ నేత కూన రవి కుమార్ కి స్పీకర్ తమ్మినేని కుమారుడు చిరంజీవి తాజాగా వార్నింగ్ ఇచ్చారు.కూన రవి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓడిపోయి కోపంలో ఉండి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Speaker Tamminenis Son Gives Warning To Tdp Leader-TeluguStop.com

బయట వ్యక్తులను నియోజకవర్గంలో తీసుకువచ్చి వైసీపీ పార్టీ నేతల ఇళ్లపై మరియు కారులపై దాడులకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు.పెనుబర్తి లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకుంటూ చూసే ప్రసక్తిలేదని కూన రవి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు అనే రీతిలో వేదికలపై ప్రసంగాలు ఇవ్వటం.  ఆ తర్వాత ఓడిపోతే దాడులు చేయటం అన్నట్టు కూన రవి వ్యవహారం ఉందని.

 Speaker Tamminenis Son Gives Warning To Tdp Leader-టీడీపీ నాయకుడి కి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని కొడుకు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పార్టీ కార్యకర్తల జోలికొస్తే.ఇక్కడ చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరు అంటూ కూన రవి కి తమ్మినేని చిరంజీవి వార్నింగ్ ఇచ్చారు.

మీరు చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.వైసీపీ పార్టీ మిమ్మల్ని విడిచి పెట్టదు రవికుమార్ గారు అంటూ చిరంజీవి హెచ్చరించారు.

 సొంత ఊరిలో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన సర్పంచ్ ఇంటిపై కున రవి కుమార్ కుటుంబ సభ్యులు దాడులకు పాల్పడ్డారు అంటూ  ఆరోపణలు చేశారు.

#Tammineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు