ట్రంప్‌ అభిశంసనలో కీలకపాత్ర: ఎవరీ నాన్సీ పెలోసి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి దిగువ సభ ఆమోదం తెలపడంతో ప్రపంచ రాజకీయాల్లో కలకలం రేగింది.అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 230 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి.

 Speaker Nancy Pelosi Donald Trump-TeluguStop.com

దీంతో ట్రంప్ సెనేట్‌లో విచారణ ఎదుర్కోనున్నారు.

అయితే ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందడం వెనుక ఓ మహిళ కీలక పాత్ర పోషించారు.

ఆమె ఎవరో కాదు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ.అభిశంసనే లక్ష్యంగా వేగంగా పావులు కదిపిన ఆమె… డెమొక్రాట్లను ఏకతాటిపై నడపటంతో పాటు, న్యాయపరమైన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యాయం చేశారు.

ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు విచారిస్తున్న ఆరు కమిటీల అధిపతులతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించారు.సాక్షులుగా ఎవరిని విచారించాలనే దానిపైనా ఆమె దిశానిర్దేశం చేసి, మొత్తం వ్యవహారాన్ని తన కనుసన్నల్లోనే నడిపించారు.

Telugu Donald Trump, Nancy Pelosi, Telugu Nri Ups, Whitehouse-

అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో 1940 మార్చి 26న జన్మించిన ఆమె తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు.తండ్రితో పాటు నాన్సీ సోదరుడు ఈస్ట్‌కోస్ట్ పోర్ట్ సిటీ మేయర్లుగా పనిచేశారు.తొలిసారి కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టారు.2007లో అమెరికా ప్రతినిధుల సభ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై పెలోసి చరిత్ర సృష్టించారు.2019లోనూ మరోసారి ఆ పదవిని అలంకరించారు.నాన్సీ భర్త పాల్ పెలోసి ఒక వ్యాపారవేత్త, వీరికి ఐదుగురు పిల్లలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube