అమెరికాలో బాలు 'లైవ్ కన్సర్ట్'..  

Spb Concert 2019 In America-sp Bala Subramanyam,spb Concert 2019,telugu Nri News Updates

తన గానామృతంతో ఎంతో మంది సంగీత ప్రేక్షకులని ఆకట్టుకున్న గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం..

అమెరికాలో బాలు 'లైవ్ కన్సర్ట్'..-SPB Live Concert 2019 In America

తెలుగు,తమిళ , హిందీ ఇలా పలు బాషలలో వేల పాటలు పాడి ఎంతో మందికి స్పూర్తి దాయకం అయ్యారు.

అందరిని తనపాటలతో పరవశింప చేశారు. పాడుతా తీయగా ఈటీవీ మొదలు పెట్టినా సరే బాలు గారు లేకపోతే ఆ కార్యక్రమం అంత భారీ సక్సెస్ అయ్యేది కాదనేది రామోజీ రావు చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు

బాలు గారి గానామృతం అమెరికాలో వినిపించబోతోంది. తాజాగా మరోసారి ఆమెరికావాసులను తన గానంతో ఊలలూగించ బోతున్నారు.

మార్చి 29న వాషింగ్టన్ డీసీలో బాలు గారి “లైవ్ కన్సర్ట్” ను నిర్వహిస్తున్నారు. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్ తదితర సంగీత దర్శకుల నుంచీ వచ్చిన అనేక సక్సెస్ ఫుల్ పాటలని బాలు గారు మరో సారి ఆలపించానున్నారు..

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలని ఈ కార్యక్రమం నివహిస్తున్నవారు తెలిపారు. అయితే టికెట్లు కొనుగోలు ముందుగానే బుక్ చేసుకోవడానికి , లేదా ఇతర వివరాలు కోసం (202)-596-2784 గల నెంబరుని సంప్రదించాలని తెలిపారు నిర్వాహకులు.