పొరపాటున టూత్‌బ్రష్ మింగేసిన యువతి.. షాకైన డాక్టర్లు..

చిన్నపిల్లలు నాణేలు, బొమ్మల ముక్కలు, బ్యాటరీలు, సూదులు తెలియక మింగేస్తుంటారు.దీని వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.అయితే చిన్నపిల్లలు మాత్రమే ఇలాంటి రిస్కుల్లో పడతారని అనుకుంటే పొరపాటే.20 ఏళ్ల వయసు దాటిన వారు కూడా ఇలాంటి సిల్లీ పనులతో చివరికి రిస్క్‌లో పడతారని తాజాగా ఒక ఘటనతో నిరూపితమైంది.

 Spanish Woman Swallows Toothbrush In Desperate Attempt To Clear Choking Details,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, 21 ఏళ్ల స్పానిష్ యువతి హీజియా( Heizea ) ఇటీవల ప్రమాదవశాత్తు టూత్ బ్రష్‌ను( Toothbrush ) మింగింది.తర్వాత ఊపిరాడక చాలా ఇబ్బంది పడింది.

టూత్‌బ్రష్‌ని ఉపయోగించి గొంతులో ఇరుక్కున్న టర్కీ ముక్కను తీయడానికి హేజియా ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది.దురదృష్టవశాత్తు, ఈ ప్రక్రియలో, ఆమె అనుకోకుండా టూత్ బ్రష్‌ను గొంతులో చేజార్చుకుంది.

Telugu Hazard, Turkey, Heizea, Latest, Spanish, Surgical, Toothbrush-Latest News

సహాయం కోసం తన తండ్రిని హీజియా పిలిచింది కానీ అతడు కూడా ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాడు.ఆ బ్రష్ బయటకి రాకపోవడంతో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది.వీల్‌చైర్‌లో ఉన్న ఆమె తండ్రి సహాయం చేయలేకపోయారు.దాంతో ఈ యువతి తనతో తానే పోరాడింది.ఈ పరిస్థితి నుంచి బయటపడటం తన వల్ల కాదని గ్రహించిన హీజియా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి( Hospital ) వెళ్లింది.

Telugu Hazard, Turkey, Heizea, Latest, Spanish, Surgical, Toothbrush-Latest News

అక్కడికి చేరుకున్న తర్వాత, డాక్టర్లు షాక్ అయ్యారు.అనంతరం ఆమె అన్నవాహికలో టూత్ బ్రష్ స్థానాన్ని నిర్ధారించడానికి X-ray టెస్ట్ కండక్ట్ చేశారు.సుమారు మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత, డాక్టర్లు ఆ వస్తువును తొలగించడానికి ఒక ప్లాన్ రూపొందించారు.

వైద్య బృందం టూత్ బ్రష్ హెడ్ చుట్టూ దారం లాంటిది కట్టి, ఆమె నోటి ద్వారా జాగ్రత్తగా బయటకు తీయడానికి సర్జికల్ టూల్( Surgical Tool ) ఉపయోగించారు.అలా టూత్ బ్రష్‌ను విజయవంతంగా వెలికితీశారు.

హీజియా మత్తులో చాలా సున్నితంగా బ్రష్ ను బయటికి తీశారు.

మత్తు వదిలాక హీజియా తన పక్కన ఉంచిన టూత్ బ్రష్‌ను చూసే చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యింది.

ఇకపై ప్రాణాలకు ముప్పు లేదని డాక్టర్లు చెప్పడంతో ఆమె మళ్లీ మామూలుగా ఊపిరి పీల్చుకోగలిగింది.అయితే ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ నోరేళ్లబెట్టేలా చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube