టాప్ యాంకర్ కాపురంలో చిచ్చు పెట్టిన లైవ్ వీడియో

కరోనా కారణంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకురావడంతో చాలా కంపెనీలు ఉద్యోగులని వర్క్ ఫ్రం హోం చేయడానికి పర్మిషన్ ఇచ్చాయి.అంతా ఆన్ లైన్ కావడంతో ఇంటి దగ్గర నుంచి పని చేయడం సులభతరం అయిపొయింది.

 Spanish Tv News Anchor Is Caught Out When Fellow Journalist, Hollywood, Lock Dow-TeluguStop.com

అయితే ఇంటి దగ్గర నుంచి పని చేయడంతో కంపెనీ మీటింగ్ లు అన్ని కూడా ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా వరకు నిర్వహిస్తున్నారు.అయితే ఈ ఆన్ లైన్ లైవ్ వీడియోలు ఇప్పుడు ఉద్యోగులకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.

అలాగే కరోనా వైరస్ సొసైటీలో ఉన్న అక్రమ సంబంధాలని బయట పెడుతున్నాయి.ఇప్పుడు ఆన్ లైన్ లైవ్ వీడియో ఓ టాప్ యాంకర్ కాపురం కూల్చేసే పరిస్థితి తీసుకొచ్చింది.

స్పెయిన్ కి చెందిన ప్రముఖ యాంకర్ ఆల్ఫాన్సో మెర్లోస్ ని లైవ్ వీడియో ఇప్పుడు ఏకంగా అతని కాపురంలో చిచ్చు పెట్టింది.

ఈ యాంకర్ తన ఇంట్లో నుంచి లైవ్ ఇస్తుండగా అతని వెనుక నుంచి సగం దుస్తులతో ఉన్న ఓ మహిళ వెళ్లింది.

వెంటనే ఈ మహిళను చూసిన వీక్షకులు ఆమె ఆల్ఫాన్సో భార్య మార్తా లోపెజ్ కాదని, ఆమె జర్నలిస్ట్ అలెక్సియా రివాస్ అని, ఆమె యాంకర్ గర్ల్‌ఫ్రెండ్ అని గుర్తుపట్టేసారు. దీంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఇక ఈ వీడియో బయటకి వచ్చి అతని పరువు తీయడంతో మీడియా ముందుకి వచ్చిన ఆల్ఫాన్సో స్పందించి తన భార్యకు క్షమాపణలు చెప్పాడు. లైవ్ షోకు ముందే తాను అలెక్సియాతో విడిపోయినట్టు చెప్పడానికి ప్రయత్నించాడు.

కానీ వీరిద్దరి మధ్య ఆ సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించడమే కాకుండా లైవ్ షో ఘటన అసహ్యంగా, సిగ్గుచేటుగా ఉందంటూ ఆల్ఫాన్సో భార్య మార్తా లోపెజ్ మండిపడింది. దీంతో వీరి మధ్య ఆ వీడియో దూరం పెంచింది అని అందరికి అర్ధమైపోయింది.

మొత్తానికి వర్క్ ఫ్రం హోం కారణంగా ఇప్పుడు ఆల్ఫాన్సో తీవ్ర ఇబ్బందులలో పడ్డాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube