కరోనా సోకి 21 ఏళ్ల ఫుట్ బాల్ కోచ్ మృతి

ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా యూరప్ దేశాల్లో మరింత చెలరేగుతుంది.ఈ కరోనా ధాటికి ఇప్పటికే ఇటలీ లో 2,158 మంది మృతి చెందగా,స్పెయిన్ లో 335 మంది మరణించినట్లు తెలుస్తుంది.

 Spanish Foot Ball Coach Dies Of Coronavirus 21-TeluguStop.com

అయితే తాజాగా స్పానిష్ లో ఒక ఫుట్ బాల్ కోచ్ కూడా ఈ కరోనా వల్ల ప్రాణాలు పోగుట్టుకున్నారు.అయితే ఫుట్ బాల కోచ్ అంటే ఎదో 40,50 ఏళ్ల వ్యక్తి కాదు కేవలం 21 సంవత్సరాల కోచ్ ఫ్రాన్సికో గార్సియా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

లుకేమియా తో బాధపడుతున్న ఆయన అతి చిన్న వయసులోనే కరోనా వైరస్ సోకడం తో మృతి చెందాడు.దీనితో ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో లుకేమియా తో పోరాడుతూ మృతి చెందిన వ్యక్తిగా ఫ్రాన్సికో నిలిచాడు.

అప్పటికే లుకేమియా తో బాధపడుతున్న ఫ్రాన్సికోలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.మలాగా ప్రాంతంలో కరోనా కారణంగా మరణించిన ఐదో వ్యక్తి గార్సియా కాగా.

మిగతా వారందరి వయసు 70-80 ఏండ్లుగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే తీవ్రమైన కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లిన తరువాత గార్సియా కు లుకేమియా కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు వైద్యులు.

అయితే ఈ యువ కోచ్ మరణం గురించి అట్లెటికో పోర్టాడా ఆల్టా సోషల్ మీడియాలో ఎమోషనల్ స్టేట్మెంట్ విడుదల చేసింది.అందులో ”అట్లెటికో కోటాడా ఆల్టా నుండి, మమ్మల్ని విడిచిపెట్టిన మా కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా యొక్క కుటుంబానికి, స్నేహితులకు మరియు బంధువులకు మా ప్రగాడ సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాము.

మరియు ఇప్పుడు మీరు లేకుండా మేము ఏం చేస్తాము, ఫ్రాన్సిస్? లీగ్‌లో గెలవడం ఎలాగో మాకు తెలియదు, కాని మేము మీ కోసం దానిని సాధిస్తాము.మేము నిన్ను మరచిపోలేము ఇక విశ్రాంతి తీసుకోండి ఎప్పటికీ ” అని అన్నారు.

Telugu Coach, Spanish, Spanishcoach-Latest News - Telugu

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ను 2 వారాల పాటు వాయిదా కూడా వేసినట్లు తెలుస్తుంది.స్పెయిన్‌లో ఇప్పటి వరకు 9,407 కేసులు నమోదు కాగా 335 మంది మృతి చెందారు.యూరప్‌లో ఇప్పటి వరకు 55వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.చైనా తర్వాత అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలు యూరప్ దేశాలే.ఇప్పటికే ఆయా దేశాలన్నీ సరిహద్దులను మూసివేసి.పలు దేశాలకు ప్రయాణాలను నిషేధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube