స్పెయిన్ ఉప ప్రధానికి కరోనా! మరణాలలో ఇటలీతో పోటీ  

Spanish Deputy Prime Minister Tests Positive For Corona Virus Carmen Calvo - Telugu Carmen Calvo, Corona Virus, Covid-19, Italy, Spanish Deputy Prime Minister Tests Positive For Corona Virus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఇటలీ అల్లాడిపోతుంది.ఆ దేశంలో రోజుకి ఆరు నుంచి ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 Spanish Deputy Prime Minister Tests Positive For Corona Virus Carmen Calvo - Telugu Covid-19 Italy

ఇక ఈ మరణాల సంఖ్యని తగ్గించడం వారికి సాధ్యం కావడం లేదు.ఇక వైరస్ ఎక్కడైతే పుట్టిందో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

అయితే చైనా ఏదో రహస్యం దాస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా మృతులతో శవాగారంగా మారిపోతున్న ఇటలీతో ఇప్పుడు స్పెయిన్ పోటీ పడుతుంది.

 Spanish Deputy Prime Minister Tests Positive For Corona Virus Carmen Calvo - Telugu Covid-19 Italy

ఆ దేశంలో ఒక్కరోజులోనే ఆరు వందల మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో భయానక వార్త అక్కడి రాజకీయ నాయకులలో కూడా వణుకుపుట్టిస్తుంది.

స్పెయిన్ ఉప ప్రధానమంత్రి కార్మెన్ కాల్వోకు సోకిందని స్పానిష్ సర్కారు ప్రకటించింది.స్పెయిన్ డిప్యూటీ ప్రధానమంత్రి కార్మెన్ కాల్వోకు పరీక్షలు చేయగా కొవిడ్-19 పాజిటివ్ అని సోకడంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ప్రపంచంలో ఇటలీ తర్వాత స్పెయిన్ దేశంలోనే అత్యధికంగా 50వేలమందికి కరోనా వైరస్ సోకింది.కరోనా వైరస్ వల్ల ఇప్పటికే స్పెయిన్ దేశంలో 3 వేల మంది మరణించారు.

ఇప్పుడు ఇటలీతో పోటీ పడుతూ స్పెయిన్ లో కూడా మృత్యువు విలయతాండవం చేస్తుంది.మరి అతి చిన్న దేశాలైన ఈ రెండు కరోనాని ఎలా కట్టడి చేస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారిపోయింది.

తాజా వార్తలు

Spanish Deputy Prime Minister Tests Positive For Corona Virus Related Telugu News,Photos/Pics,Images..