అంతరించి పోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి అనేది మనం నమ్మితీరాల్సిన నిజం.ఎందుకంటే ప్రస్తుత జెనరేషన్ పిల్లలంతా తమ భవిష్యత్ అవసరాల కోసం ఇంగ్లీష్ వైపే అడుగులు వేస్తున్నారు.
తెలుగు నటీనటులు కూడా తెలుగులో సరిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.కానీ ఓ స్పానిష్ అమ్మాయి తెలుగు సినిమాలో నటించడమే కాదు.
తెలుగులోనే మాట్లాడి.తెలుగుపై తనకున్న మమకారం ఎలాంటిదో చెప్పకనే చెప్పింది.
ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశంకాని దేశం, భాషకాని భాష.అయినా తనకు అడ్డేం కాదని నిరూపించింది స్పెయిన్ కి చెందిన ఆల్బా ఫ్లోరిస్.ఈ అందాల తార తెలుగు సినిమాలో నటించి తన సత్తా చాటింది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మనీ హైస్ అనే సిరీస్ లో కీలక పాత్ర పోషించిన నటి ఆల్బా ఫ్లోరిస్.దోపిడీ డ్రామాతో నడిచిన ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నైరోబి పాత్రలో ఒదిగిపోయింది.1952లో వీరి కుటుంబం ఇండియాకు వచ్చింది.ఇక్కడే ఓ మిషనరీ సంస్థను స్థాపించింది.
పేదలకు అండగా ఉంది.పాఠశాలలు కట్టించింది.
గ్రామాల్లో తాగు నీటి కోసం బావులు తవ్వించింది.ఏపీలో విన్సెన్ట్, అన్నా ఫెరీర్ దంపతులు పలు ఆస్పత్రులు కట్టించారు.
ఎంతో సేవ చేశారు.అక్కడి జనాలకు అండగా నిలిచారు.అయితే 2009లో అనంతపురంలోనే విన్సెన్ట్ మరణించారు.2013లో ఈ దంపతులపై ఓ బయోగ్రఫీ తెరకెక్కించారు.
ఈ బయోగ్రఫీలో విన్సెన్ట్ గా ఇమోనల్ ఐయస్ యాక్ట్ చేసింది.అతడి సహాయకురాలు షామీరాగా ఆల్బా ఫ్లోరిస్ నటించింది.ఒంటిజడ, నుదుట బొట్టుతో తెలుగు అమ్మాయిగా నటించింది.అంతేకాదు.తెలుగులోనే మాట్లాడి ఆశ్చర్యం కలిగించింది.చిన్న మొత్తం మనచేతిలో ఉంటే.
అనంతపురం దళితులంతా ముఖ్యమైన మార్పుకు కారణం అవుతారని చెప్పింది.ఆమె మాటలన్నీ తెలుగులోనే ఉంటాయి.
ఇంస్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫ్యాన్ పేజీ ఉంది.అందులో ఈమాటలు వినవచ్చు.టీవీ షోలు, వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఆల్బా.2017లో వచ్చిన మనీ హైస్ తో స్టార్ యాక్ట్రస్ గా మారిపోయింది.