కరోనా భయం తో లక్ష మింక్ లను చంపాలంటూ ప్రభుత్వం ఆదేశాలు,ఎక్కడంటే..?

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా స్పెయిన్ ను కూడా అల్లాడిస్తున్న విషయం విదితమే.ఇప్పటికే 2.5 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా,28 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 Spain Orders Culling Of Almost One Lakh Minks, Mink,mink Farm,corona Effect-TeluguStop.com

ఈ వైరస్ ఎక్కడ నుంచి సొంతుందో అన్న భయం తో ఎవరితోనూ కలవకుండా దూరం దూరంగా ఉంటున్నారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

తాజాగా అరగాన్ ప్రావిన్స్ లో ఉన్న ఒక జంతువుల ఫామ్ హౌస్ లో వరుసగా చోటుచేసుకున్న కరోనా కేసుల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే… అరగాన్ ప్రావిన్సులో ఉన్న మింక్ అనే జంతువులను పెంచే ఫామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్యకు కరోనా సోకింది.

కొన్ని రోజులకు అతనితో పాటు ఫాంలో ఉండే మరో ఆరుగురికి కూడా సోకడం తో విషయం తెలుసుకున్న అధికారులు జులై 13న మింక్ జంతువులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.దాదాపుగా 87 శాతం వరకు వ్యాధి బారిన పడ్డాయని తెలుసుకున్నారు.

దీంతో వాటి ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉందని చంపేయాలంటూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఆ ఫామ్ నడుపుతున్న వ్యక్తికి నష్టపరిహారం కూడా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి నిర్ణయం తప్పనిసరి అయ్యింది అని వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొన్న మొదటి మింక్ ఫామ్ ఇది కాదు.నెదర్లాండ్స్ లోని మింక్ ఫామ్ లో కూడా ఇలాంటి కరోనా వ్యాప్తి ఘటనే చోటుచేసుకుంది.ఆ సమయంలో కూడా మింక్ ల వల్ల మానవులకు కూడా కరోనా సోకుతుంది అని నమ్ముతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నాయి ప్రభుత్వాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube