గంటలో ఆయుధాలను పంపడానికి ఒక ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్న స్పేస్ ఎక్స్!

ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష ప్రయోగశాల ‘స్పేస్ ఎక్స్’ మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టబోతుంది.అంగారకుడిపై మనుషులను తీసుకెళ్లడానికి చేపట్టిన మిషన్ ఇప్పటికే చాలా పురోగతి సాధించింది.

 Spacex Crew Launch Delayed To Assess Merlin Engine Concern, Space X, Spacex Ceo-TeluguStop.com

తాజాగా ప్రపంచంలో ఏ దేశనికైనా గంటలో ఆయుధాలని పంపే రాకెట్ ను తయారు చేసేందుకే అమెరికా సైన్యం తో ఒప్పందం కుదుర్చుకుంది.ఒక చోటుకి ఉపయోగించిన రాకెట్ ను తిరిగి తీసుకురావడంలో విజయవంతం అయిన స్పేస్ ఎక్స్ సరుకులను రవాణా చేసే రాకెట్ ను తయారుచేయడం ఇదే మొదటి సారి.

ఈ ప్రయత్నంలో తమకు అనుబంధంగా కొనసాగుతున్న వైమానిక సంస్థ ఎక్స్ ఆర్క్ సహకారాన్ని కూడా కోరింది.అమెరికా లోని ఫ్లోరిడా నుండి 7500 మైళ్ళ దూరంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోని అమెరికా వైమానిక స్థావరానికి గంటలో ఆయుధాలను చేర్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ప్రస్తుతం కార్గో విమానాల ద్వారా అక్కడికి ఆయుధాలను పంపడానికి 15 గంటల సమయం పడుతుంది.అలాంటి విమానాలు అమెరికా దగ్గర ప్రస్తుతం 233 ఉన్నాయి.వాటి వేగం కేవలం 590km లు మాత్రమే.వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube