మంచి వెనుకే చెడు: రోదసి యాత్రలతో మండిపోనున్న భూగోళం.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉపగ్రహాలు, వ్యోమనౌకలు రాకెట్ల ప్రయోగాలు విజయవంతమైతే పరిశోధకులు, ఆ సంస్థలు, ప్రభుత్వాలతోపాటు సామాన్య ప్రజలు కూడా సంబరపడిపోతారు.నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లను చూస్తే ఎక్కడా లేని గర్వం పలువురిలో కనిపిస్తోంది.

 Space Tourism: Rockets Emit 100 Times More Co₂ Per Passenger Than Flights, Spa-TeluguStop.com

కానీ.ఈ విపరీతమైన ప్రయోగాలు అంతరిక్షానికి చెడు చేస్తున్నాయంటూ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్ల నుంచి హెచ్చరిస్తున్నారు.అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలే ఇందుకు కారణం.

1957లో అంతరిక్ష ప్రయోగాలకు నాందీ పడింది.నాటి నుంచి నేటి వరకు మొత్తం 8950 ఉపగ్రహాలను వివిధ దేశాలు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాయి.అయితే.ఈ ఉపగ్రహ ప్రయోగాల కారణంగా 2013 జులై నాటికి 1 సెంటీమీటర్ కంటే చిన్న వస్తువులు 17 కోట్లు, 1 సెంటీ మీటర్ నుంచి 10 సెంటీమీటర్ల పొడవున్న వస్తువులు 9 లక్షల 70 వేలు, 10 సెంటీమీటర్ల కంటే పెద్దవైన వస్తువులు 33 వేలు అంతరిక్షంలో వుండిపోయాయయని అమెరికా, రష్యా స్పేస్ ఏజెన్సీలు వెల్లడించాయి.అయితే 5 సెంటీమీటర్ల కంటే పెద్దవైన వస్తువు అంతరిక్షంలో 2009 నాటికి కేవలం 19 వేలు మాత్రమే వుండగా.

ఆ తర్వాత నాలుగేళ్ళలో అంతరిక్ష వ్యర్థాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సెంటీమీటర్ కంటే చిన్నవైన వస్తువులు అంతరిక్షంలో కోటికి పైగానే వుండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇక తాజాగా అంతరిక్ష పర్యాటకంలో సరికొత్త చరిత్ర సృష్టించారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.ముందుగా రిచర్డ్ రోదసిలోకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే.

ఆయన కంటే ఎక్కువ దూరం ఖగోళంలోకి వెళ్లిన ఘనత దక్కించుకున్నారు బెజోస్.ఈ ఇద్దరికి తోడు ఎలన్ మస్క్ కూడా త్వరలో యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.

వీరిద్దరిని మించి ప్రత్యేకత సాధించాలని ఎలన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.ఈ కుబేరుల మధ్య పోటీ వల్ల మనిషికి అంతరిక్షాన్ని చూడాలన్న కోరిక తీరేలా చేసింది.

కానీ కత్తికి రెండు వైపులా పదును వున్నట్లుగానే రోదసి యాత్రల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అదే కాలుష్యం.

సాధారణ విమానాల కంటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమనౌకలు 100 రెట్లు అధికంగా కర్బన వాయువును విడుదల చేస్తాయని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇలాయిసే మరాయిస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లూ ఒరిజిన్‌ రాకెట్లలో బ్లూ ఇంజిన్‌ 3 (బీఈ 3) ద్రవ రూపంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను మండించి పైకి ఎగురుతుంది.

ఇక వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్‌ యూనిటీ ఇంజన్‌లో కర్బన ఆధారిత ఇంధనాన్ని, హైడ్రోక్సైల్‌-టెర్మినేటెడ్‌ పాలీబుటాడైన్‌ (హెచ్‌టీపీబీ), నైట్రస్‌ ఆక్సైడ్‌లను వినియోగించారు.ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్లలో కిరోసిన్‌ను, ద్రవ రూపంలోని ఆక్సిజన్‌ను ఉపయోగిస్తున్నారు.

ఈ మొత్తం రాకెట్లలో ఇంధనాన్ని మండించడం ద్వారా మనిషి రోదసి యాత్రలు చేస్తున్నాడు.లాంచింగ్‌ లేదా తిరిగి భూమి పైకి రాకెట్‌ వచ్చే సమయంలో అవి ఉత్పత్తి చేసే వేడి, భూ వాతావరణంలోని వాయువులను కాలుష్యంగా మారుస్తుంది.

వాటిలో కొన్ని వాయువులు ఓజోన్‌ పొరను ఆక్సిజన్‌గా మార్చేస్తాయట.దీని వలన భూ వాతావరణం మరింత త్వరగా వేడెక్కిపోతుంది.

Telugu Alan Musk, Jeff Bezos, Amazon, Virgin Galactic, Richard Branson, Space, S

ఇప్పటికే ఏడాదికి సుమారు 400 వరకూ యాత్రల్ని చేపడతామని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ చెబుతోంది.బెజోస్‌, మస్క్‌ సంస్థలు ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయి.విమానాల కంటే 100 రెట్లు అధిక కాలుష్యాన్ని వెలువరించే ఈ వ్యోమనౌకల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం వుండటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్రాన్సన్, బెజోస్, ఎలన్ మస్క్‌లకు తోడు.

ప్రపంచంలోని అన్ని స్పేస్ ఏజెన్సీలు, ఇతర సంస్థలు కూడా ఇదే తరహా ప్రయోగాలు చేపడితే భూగోళం పరిస్థితి ఏంటన్నది ఊహించడానికి కూడా కష్టంగా వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube