ఆ నగరంలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ.. ఎక్కడంటే..?

Space Free For Those Who Will Construct New Home In That City

ఈ రోజుల్లో ఇంటి నిర్మాణం కంటే స్థలాల ధరలే ఎక్కువగా ఉంటున్నాయి.ఇంకొద్ది రోజుల్లో భూమి బంగారంతో సమానంగా ధర పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

 Space Free For Those Who Will Construct New Home In That City-TeluguStop.com

అయితే ఒక నగరంలో మాత్రం ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా స్థలం ఇస్తున్నారు.ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ఇల్లు కట్టుకునే వారికి ఫ్రీగా భూ స్థలాలు అందిస్తోంది ప్రభుత్వం.

దీనికి కారణం ఆ నగరంలో జనాభా సంఖ్య పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడమే.పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు క్విల్పీ నగరంలో ప్రస్తుతం కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే నివసిస్తున్నారు.

 Space Free For Those Who Will Construct New Home In That City-ఆ నగరంలో ఇల్లు కట్టుకుంటే స్థలం ఫ్రీ.. ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే స్థలాలు ఫ్రీ అని సిటీ కౌన్సిల్ ప్రకటించడంతో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు.భారతీయులతో సహా ఇతర దేశీయులు ఉచితంగా వస్తున్న స్థలాలను వదులుకోడానికి ఇష్టపడలేదు.

దీనికి ఎలాంటి షరతులు ఉంటాయి.నిజంగానే ఉచితంగా స్థలాలు అందిస్తున్నారా అంటూ చాలామంది ఆరా తీస్తున్నారట.

అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం తమ దేశ పౌరులకు, ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ హోదా ఉన్న వారికి మాత్రమే స్థలాలు అందిస్తామని స్పష్టం చేసింది.క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని పశ్చిమంవైపు ఉండే క్విల్పీ నగరం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

జన జీవనానికి, ట్రాఫిక్ శబ్దాలకు చాలా దూరంగా ఎడారిలో విసిరేసినట్లుగా ఉంటుంది.ప్రశాంతత కోరుకునే వారు ఈ స్థలాలలో ఎంచక్కా ఇల్లు కట్టుకోవచ్చు.

Telugu Australia, City, Construct New Home, Construction, Farming, Increase Population, Land Free, Latest News, Space Free, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ పట్టణంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం భారీ ఎత్తున ఉంది.అయితే అక్కడ జనాభా సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటంతో వాటి బాగోగులు చూసుకోవడం కష్టతరమైంది.దీంతో వాటి యజమానులు తమ నగరంలోనూ జనాభా సంఖ్య పెంచాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి కల్పించడంతోపాటు అన్ని నిత్యావసరాలు అందించాల్సి వస్తోంది.

అయితే కేవలం ఒక్క ఇల్లు ఉన్నవారు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నారు.అందుకే కొత్తగా ఇళ్లతో పాటు జనాభా ని ఈ రాష్ట్రంలో పెంచాలని యజమానులు మొరపెట్టుకుంటున్నారు.

ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చని ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత భూముల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

#Space #Australia #Construct

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube