పోలీస్‌ కానిస్టేబుల్స్‌కు ఇంగ్లీష్‌ పరీక్ష పెట్టిన ఎస్పీ

ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్స్‌ విద్యా అర్హత చాలా తక్కువగా ఉండేది.దాంతో సీనియర్‌ కానిస్టేబుల్స్‌ ఎవరు కూడా చదువు పరంగా మంచి సమర్ధులు ఉండే వారు కాదు.

 Sp To Test English For Police Constables-TeluguStop.com

ఇక వారి ఇంగ్లీష్‌ పరిజ్ఞానం మరీ పూర్‌గా ఉంటుంది.కొందరు బేసిక్‌ ఇంగ్లీష్‌ పరిజ్ఞానం కూడా కలిగి లేరు.

ఆ కారణాల వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.అందుకే ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఉన్నతాధికారులు తమ కానిస్టేబుల్స్‌కు ఇంగ్లీష్‌ పరిజ్ఞానం అవసరం అంటూ నిర్ణయించారు.

అందుకే ప్రతి ఒక్క కానిస్టేబుల్‌ కూడా ఇకపై లీవ్‌ లెటర్‌ను ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలని ఆదేశించారు.

మొదట దీనిని ఎస్పీ రంజన్‌ వర్మ ప్రవేశ పెట్టాడు.

పోలీసులు ఎక్కువ శాతం ఇంగ్లీష్‌లో ఫిర్యాదులు అందుకుంటున్నారు.ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌ మరియు నిఘా సంస్థలకు సంబంధించిన లేఖలను ఇంగ్లీష్‌లోనే అందుకోవాల్సి ఉంటుంది.

వాటిని అర్థం చేసుకోలేక పోవడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయి.ఆ కారణంగానే పోలీసులు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలంటూ నేను ఆదేశించాను.

అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందిందని ఎస్పీ రంజన్‌ వర్మ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube