బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై స్పందిచిన ఎస్పీ శైలజ..!

దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని వదలడం లేదు.

 Sp Shailaja Balasubramanians Coronavirus Health Bulliten-TeluguStop.com

ఈ వైరస్ కారణంగా చాలమంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, అతడి భార్య కరోనా బారినపడిన విషయం తెలిసిందే.అయితే బాలు ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్లపై వైద్యం అందిస్తున్నారు.

 Sp Shailaja Balasubramanians Coronavirus Health Bulliten-బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై స్పందిచిన ఎస్పీ శైలజ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో బాలు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.అయితే తాజాగా బాలు ఆరోగ్యపై అతని చెల్లి ప్రముఖ గాయని ఎస్పీ శైలజ ఊరట కలిగించే వార్త చెప్పారు.

సోమవారం బాలు ఆరోగ్యం పూర్తిగా విషమించిందని అతనికి వెంటిలేటర్లపై వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు హెల్త్ బులిటెన్ ని విడుదల చేశారు.దింతో పలువురు అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.

ఈ విషయం పైన బాలు చెల్లలు ఎస్పీ శైలజ స్పందించారు.ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

అంతేకాకుండా వైద్యుల చికిత్సకు అతని ఆరోగ్యం సహకరిస్తుందని వెల్లడించారు.ఇక వైద్య సేవలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని తెలిపారు.

అంతేకాదు ఆమె బాలు కోలుకుంటున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.బాలు త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారని ఆమె అన్నారు.

అయితే బాలుకు కరోనా సోకినప్పటికీ అతనికి మహమ్మారి లక్షణాలు లేకపోవడంతో ఆయన ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.కొన్ని రోజుల తర్వాత అతనికి కరోనా లక్షణాలు బయటపడడంతో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

అయితే బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అందరు కోరుకుంటున్నారు.అయితే శైలజ మాటలతో అభిమానులకు కొంత ఊరట కలిగిస్తుంది.

#SP Balu #Chennai #SP Shailaja #Doctors #Carona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు