సోషల్ మీడియాలో వైరలవుతున్న ఎస్పి సరిత వీడియో..ప్రేమికుల గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.     2018-09-25   13:13:18  IST  Rajakumari K

ప్రణయ్ హత్య తరవాత ప్రేమ వివాహాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది.అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో బయట ఏ ఇద్దరిని కదిపినా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు..పరువు పేరుతో తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు అడ్డుచెప్తూ,పిల్లల హక్కులను కాల రాస్తున్నారని.ప అసలు పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రుల పెత్తనం ఏంటి అని కొందరు ఆరోపిస్తుంటే…కని, పెంచి, జీవితంలో ప్రయోజకులను చేయడానికి చెమటోడ్చే తల్లిదండ్రులను కాదని.. ప్రేమ మాయలో పడి అమ్మాయిలు మోసపోతున్నారన్నది మరికొందరి వాదన..ఈ నేపథ్యంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ సరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

గుంటూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సరిత ప్రేమ వివాహాల గురించి అద్భుతంగా మాట్లాడారు. మాయగాళ్ల వలలో చిక్కుకుని అమ్మాయిలు మోసపోతున్నారని, ప్రేమ మాయలో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారని ఉదాహరణలతో సహా సరిత వివరించారు. ప్రేమ పెళ్లిళ్లకు అందం, కులం, డబ్బు అనేది ప్రధానం కాదని ‘మ్యాచింగ్’ అవసరమని అన్నారు. ఆ మ్యాచింగ్ అందం, ఆలోచన, డబ్బు, హోదాలో అవసరంలేదని.. నన్ను కాపాడగలడు అనే నమ్మకం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే ఆడపిల్లకి అది చాలని చెప్పారు.

తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేయగలిగే వ్యక్తి అయితే అది మంచి మ్యాచ్ అని అన్నారు. కానీ ప్రస్తుతం ఆడపిల్లలు మోసగాళ్లను నమ్మి కష్టపడి పెంచిన తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న వీడియో మీరూ ఒ లుక్కేయండి..
ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..