అలాంటిది ఏమీ లేదంటూ ఎస్పీబీ ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన చరణ్

సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి.క్షణాల్లోనే వార్తలు అటూ ఇటూ చక్కర్లు కొడుతూ సోషల్ మీడియా ను ఒక్క ఊపు ఊపేస్తున్నాయి.

 Sp Charan Gave Clarity About His Father's Corona Negative Result, Corona Negativ-TeluguStop.com

ఆ మధ్య కరోనా తో హాస్పటల్ లో ఉన్న మాజీ రాష్ట్రపతి మృతి చెందారు అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా, ఇప్పుడు కరోనా బారినపడిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పై కూడా ఒక వార్త హల్ చల్ చేస్తుంది.కరోనా బారిన పడిన ఎస్పీబీ ఈ నెల 5 వ తేదీన చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరిన విషయం విదితమే.

అయితే గత కొద్దీ రోజులు గా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఎస్పీబీ కి బారిన పడిన ఆయనకు ఎక్మో సపోర్ట్ తో వెంటిలేటర్ పైనే ఎం జీ ఎం ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అయితే తాజాగా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చేసింది అని,ఆయన కరోనా ను జయించేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

అసలుకే తమ ఫెవరెట్ గాయకుడు ఇలా ఆసుపత్రి బెడ్ పై ఉండడం తో ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ఆయన అభిమానులు ఒకపక్క ప్రార్ధనలు చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి నెగిటివ్ వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా లోరావడం తో అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.ఎస్పీబీ కి నెగిటివ్ రావడం తో ఆయన అభిమానులు తెగ ఆనంద పడుతుండగా, ఇప్పుడు ఆ వార్తలపై ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు.

నెగిటివ్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.బాలు కు కరోనా నెగిటివ్ రాలేదని.ఆయన ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారని చరణ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా “మా నాన్న ఆరోగ్యం పై నాకే సమాచారం వస్తుంది.

ఆయనకు నెగిటివ్ వచ్చింది అన్న విషయంలో ఎలాంటి నిజం లేదు.అయితే ప్రస్తుతం నాన్న ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యం పై వస్తున్న వదంతులు నమ్మకండి అంటూ తాజాగా ఒక వీడియో ను చరణ్ పోస్ట్ చేశారు.

మా నాన్న ఇంకా ఎక్మో సపోర్ట్ తో వెంటిలేటర్ పై వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్ధిద్దాం “.

అని ఎస్పీ చరణ్ అన్నారు.

అయితే కరోనా మహమ్మారితో చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటూ పలువురు ప్రముఖులు,అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube