ఎస్పీ బాలు పాడిన చివరి పాటకి ఊహించని క్రేజ్… సోషల్ మీడియాలో ట్రెండ్  

SP balu Last Song Viral In Social Media, Tollywood, Telugu Cinema, SP Balasubrahmanyam, Palasa 1978, Raghu Kunche - Telugu Palasa 1978, Raghu Kunche, Sp Balu Last Song Viral In Social Media, Sp.balasubrahmanyam, Telugu Cinema, Tollywood

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో నలభై రోజులు పోరాడి చివరికి ప్రాణాలు విడిచారు.అతని మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పాలి.

TeluguStop.com - Sp Balu Last Song Viral In Social Media

ఘంటశాల మరణం ఎంత మందిని కలచివేసిందో తెలియదు కానీ ఎస్పీ బాలు మరణం మాత్రం యావత్ దేశాన్ని కదిలించింది.తన స్వరంతో దేశంలో సుమారు అన్ని భాషలలో పాటలు పాడే సామర్ధ్యం ఉన్న ఈ స్వర దిగ్గజం ఇప్పటి వరకు అన్ని భాషలలో కలిపి 50 వేల వరకు పాటలు పాడారు.

హిందీ ప్రేక్షకులని సైతం తన స్వరంతో ఉర్రూతలూగించిన బాలు మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.ఒక తెలుగువాడైన అన్ని ప్రాంతాలకి సుపరిచుడుగా బాలు మారిపోయారు.

TeluguStop.com - ఎస్పీ బాలు పాడిన చివరి పాటకి ఊహించని క్రేజ్… సోషల్ మీడియాలో ట్రెండ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినీ ప్రపంచంలో ఇక ఏ గాయకుడు కూడా అందుకోలేని శిఖరాలని ఎస్పీ బాలు అధిరోహించారు.ఈ మధ్యకాలంలో సినిమాలకి పాటలు పాడటం ఆయన పూర్తిగా తగ్గించేశారనే చెప్పాలి.

ఈ పాట ఎస్పీ బాలు పాడితేనె కరెక్ట్ అని భావించేవాళ్లు ఏరికోరి మరి అతనితో ఆ పాటలు పాడించుకునే వారు.
అలాంటి స్వర దిగ్గజం భౌతికంగా మనకి లేకపోయిన పాటల రూపంలో కొన్ని తరాల పాటు ఆయన గుర్తుండిపోతారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన చివరిగా పాడిన పాట గురించి అతని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.ఆయన పాడిన పాటలు వినాలని, అలాగే చివరిగా పాడిన పాట ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు ఆయన పాడిన చివరి పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.పలాస 1978 సినిమా కోసం రఘు కుంచె స్వరపరిచిన ఓ సొగసరి అంటూ సాగే పాటను ఆయన పాడారు.

ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న రఘు, అంతటి మహానుభావుడితో పాట పాడించడం తన అదృష్టమని అన్నారు.ఎస్పీబీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, మనం ఓ గొప్ప గాయకుడిని కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు.

ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది.

#Palasa 1978 #Raghu Kunche #SPBalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sp Balu Last Song Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..