హీరో కృష్ణతో మూడేళ్లు మాట్లాడని బాలు.. ఎందుకంటే?  

sp balu had differences with super star krishna, super star krishna, sp bala subramanyam, clashes, mahesh babu, bala subramnyam death - Telugu Bala Subramnyam Death, Balu Differences Krishna, Clashes, Mahesh Babu, Sp Balu, Sp Balu Had Differences With Super Star Krishna, Sp. Bala Subramanyam, Super Star Krishna, Superstar Krishna, Veturi Sundarrammurthy

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.టాలీవుడ్, కోలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

TeluguStop.com - Sp Balu Had Differences With Superstar Krishna

ఇంజనీర్ కావాలని అనుకుని సింగర్ అయిన బాలు 40 సంవత్సరాల కెరీర్ లో 38,000కు పైగా పాటలు పాడారు.ఏ హీరో సినిమాకు పని చేస్తే ఆ హీరోనే స్వయంగా పాడాడేమో అనే విధంగా పాట పాడటం ఎస్పీ బాలు ప్రత్యేకత.

చూడటానికి ఎంతో సౌమ్యంగా కనిపించే ఎస్పీ బాలు పలు సందర్భాల్లో మొండిగా వ్యవహరిస్తారని పేరుంది.బాలసుబ్రహ్మణ్యం సూపర్ స్టార్ కృష్ణతో జరిగిన చిన్న గొడవ వల్ల మూడు సంవత్సరాలు కృష్ణ సినిమాలకు పాటలు పాడకపోవడంతో పాటు ఆయనతో కనీసం మాట్లాడలేదు.

TeluguStop.com - హీరో కృష్ణతో మూడేళ్లు మాట్లాడని బాలు.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒక సందర్భంలో బాలు కృష్ణ గారితో ఉన్న వివాదం గురించి స్పందించి వివరణ ఇచ్చారు.కృష్ణ సినిమాలకు పని చేసిన ఒక సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఫోన్ చేసి నిర్మాతను బాలు డబ్బులు అడిగారు.

ఆ సమయంలో నిర్మాత బాలుతో ఇష్టానుసారం మాట్లాడాడు.దీంతో బాలు ఫోన్ పెట్టేశాడు.

ఆ తరువాత కృష్ణ బాలుకు ఫోన్ చేసి బాలూ గారూ.మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావని నిర్మాతతో అన్నారట.

మీకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పుడే పంపిస్తాను అని పంపించాడని చెప్పారు.ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కలిసి పని చేయలేదని.

మాట్లాడుకునేవాళ్లం కాదని చెప్పారు.

ఆ తర్వాత వేటూరి సుందరరమ్మూర్తి కలిపే ప్రయత్నం చేశాడని కృష్ణ, తాను కలిసి పని చేశామని వెల్లడించారు.

మోహన్ బాబు సినిమాలకు పాడటానికి కూడా బాలు నిరాకరించాడని తెలుస్తోంది.అయితే మోహన్ బాబు సినిమాలకు పాడటానికి బాలు నిరాకరించడానికి గల కారణాలు తెలియదు.ఎస్పీ బాలు మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

#BalaSubramnyam #SP.Bala #SP Balu #BaluDifferences #SpBalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sp Balu Had Differences With Superstar Krishna Related Telugu News,Photos/Pics,Images..