గుడ్‌ న్యూస్‌ : వారం నుండి పది రోజుల్లో బయటకు బాలు

దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి అభిమానులకు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ గుడ్‌ న్యూస్‌ ను తెలియజేశాడు.గత నెల రోజులుగా కరోనాతో పోరాటం చేస్తున్న బాలు గారు ఇప్పుడు దాన్ని జయించినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

 Sp Bala Subramanyam Tests Negative For Corona, Covid -19, Sp Balu, Health Update-TeluguStop.com

కరోనా పాజిటివ్‌ అంటూ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన బాలు గారికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిందని చరణ్‌ అన్నాడు.అయితే నాన్న ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు అంటూ చరణ్‌ పేర్కొన్నాడు.

ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్‌ ఉంది.దాని వల్ల శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి.

అందుకే ఆయన్ను ఇంకా వెంటిలేటర్‌ పైనే ఉంచినట్లుగా సమాచారం అందుతోంది.అయితే బాలు గారు చాలా ఉల్లాసంగా మాత్రం ఉన్నారని ఆయన తనయుడు చెప్పాడు.

మొబైల్‌ లో క్రికెట్‌ మరియు టెన్నీస్‌ చూడటంతో పాటు ఐపీఎల్‌ గురించి కూడా బాలు గారు అడిగినట్లుగా ఆసుపత్రి వర్గాల వారు చెబుతున్నారు.ఇక బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

వారం నుండి పది రోజుల్లో బాలు ఐసీయూ నుండి సాదారణ వార్డ్‌ కు మార్చబడే అవకాశం ఉంది.ఐసీయూలో బాలుకు దాదాపు మూడు వారాలుగా చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే.

ఆయనకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఆయన్ను ఐసీయూ నుండి బయటకు తీసుకు వస్తారని అంటున్నారు.

Telugu Coronavirus, Covid, Spbala, Sp Balu, Sp Balu Cricket, Sp Charan-Movie

సాదారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ వారం నుండి రెండు వారాలు ఉంటుంది.కాని బాలు గారి వయసు కాస్త ఎక్కువ అవ్వడంతో ఆయనకు ఎక్కవ సమయం ఇన్ఫెక్షన్‌ ఉంటుంది.రెండు వారాలుగా ఆయన ఇన్ఫెక్షన్‌ తో బాధపడుతున్నారు.

త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తారని 2021 లో ఆయన మళ్లీ మైక్‌ పట్టుకోవడం ఖాయం అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు.ఆయన కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా పూజలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు.

ఆ పూజలు ఫలించాయో ఏమో కాని బాలు గారి ఆరోగ్యం కుదుట పడింది.ముఖ్యంగా కరోనా నెగటివ్ రావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube