మూగబోయిన బాలు గానామృతం.. శోక సంద్రంలో సంగీత ప్రపంచం  

SP Balasubramanyam Passes Away At 74, SP Balasubramanyam, SP Balu, SP Balu Health, SP Balu Dead, Balasubramanyam Dead - Telugu Balasubramanyam Dead, Sp Balasubramanyam, Sp Balu, Sp Balu Dead, Sp Balu Health

సినీ, సంగీత ప్రపంచంలో మరో ధృవతార నేలరాలింది.గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Sp Balasubramanyam Passes Away At 74

ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడ్డ బాలు, చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టు 5న చేరారు.కరోనాతో పోరాడి గెలిచిన ఆయన, అనారోగ్యం కారణంగా కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన వెల్లడించాయి.గురువారం రాత్రి అకస్మాత్తుగా బాలు ఆరోగ్యం తీవ్ర విషమంగా మారిందని, దీంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

TeluguStop.com - మూగబోయిన బాలు గానామృతం.. శోక సంద్రంలో సంగీత ప్రపంచం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలు ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్ర కృషి చేశారని, అయినా వారు ఆయన్ను కాపాడలేకపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.కాగా బాలు మరణించారని గతంలోనే వార్తలు రావడంతో, ఆయన స్వయంగా ఆసుపత్రి నుండి తన అభిమానులు ఆందోళన పడవద్దంటూ కోరారు.

ఇక బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కూడా ఇటీవల ఆయన ఆరోగ్యంపై స్పందించి, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.కాగా కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుండటంతో వెంటిలేటర్ చికిత్సను తీసేసినట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే నిన్న రాత్రి బాలు ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఎక్మోలైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న తమిళ నటుడు కమల్ హాసన్ హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని బాలు ఆరోగ్యంపై ఆరా తీశారు.కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఆసుపత్రికి ఫోన్ చేసి బాలు ఆరోగ్యంపై ఆరా తీశారు.ఇక బాలు చివరి కోరికగా ఆయన ఉంటున్న వార్డులో ఆయనకు ఎంతో ఇష్టమైన పాటలను స్పీకర్ల ద్వారా వినిపించే ఏర్పాటు చేశారు.

బాలు ఆరోగ్యం విషమంగా మారిందనే వార్తతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.

దాదాపు 5 దశాబ్దాలుగా తన గానంతో సంగీత సరస్వతిని అలరిస్తూ వస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తతో యావత్ భారత దేశ సంగీత, సినీ రంగాలు ఉలిక్కిపడ్డాయి.ఆయన మరణించారనే వార్తతో సంగీత ప్రపంచం మూగబోయింది.16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత బాలు సొంతం.అనేకమంది గాయనీగాయకులకు గురువుగా సంగీతంలో ఓనమాలు నేర్పిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.బాలు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఇన్నేళ్లుగా ఆయన అందించిన గానామృతం మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది.

తెలుగుస్టాప్.కామ్ ఈ గానగంధర్వుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది.

#SP Balu Dead #SP Balu #SP Balu Health

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sp Balasubramanyam Passes Away At 74 Related Telugu News,Photos/Pics,Images..