నాన్న ఇంటికి వెళ్లేందుకు ఆతృతగా ఉన్నారు

లెజెండరీ సింగర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గత నెలలో కరోనా కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే.మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు అనిపించినా వారం రోజుల్లో ఆయనకు శ్వాస సంబంధించిన సమస్య తలెత్తడంతో ఐసీయూలోకి మార్చినట్లు గా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించారు.

 Sp Balasubramaniam Present Health Condition Says By Sp Charan, Sp Charan, Sp Bal-TeluguStop.com

అప్పటి నుండి బాలు గారి ఆరోగ్యం విషయంలో అభిమానులు మరియు కుటుంబ సభ్యులు సినీ వర్గాల వారు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన ఆరోగ్యంతో బయటకు రావాలి అంటూ ఎంతో మంది పూజలు కూడా చేశారు.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బాలు ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి.

దాదాపు రెండు మూడు వారాల పాటు ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంది.

ఎట్టకేలకు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ గుడ్ న్యూస్‌ చెప్పారు.కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా బాలు గారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఐసీయూ లోనే ఉంచి చికిత్స చేస్తున్నట్లు గా చెప్పిన చరణ్ తాజాగా తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం నాన్న ఇంటికి వెళ్ళాలనే ఆసక్తితో ఉన్నారని ఎప్పుడెప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానా అని ఎదురు చూస్తున్నాడు అంటూ తాజాగా విడుదల చేసిన వీడియోలో చరణ్ పేర్కొన్నాడు.

ఇప్పటికే ఘన ఆహార పదార్థాలు ఇస్తున్న ఆస్పత్రి వర్గాలు అతి త్వరలో ఆయన్ను ఐసీయూ నుండి బయటకు తీసుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తానికి ఆయన అభిమానుల పూజ ఫలితంగా కరోనాను జయించిడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా బయటికి రాబోతున్నారు.మరికొన్ని నెలల్లో ఆయన మైక్ పట్టుకొని మళ్ళీ పాటలు పాడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గాయకుడిగా కొన్ని వేల పాటలు పాడిన ఆయన గిన్నిస్ రికార్డ్ కూడా దక్కించుకున్నారు.దేశం గర్వించదగ్గ సింగర్ అయిన ఎస్పీ బాల సుబ్రమణ్యం గారు మరింత త్వరగా కోలుకోవాలని అంటూ మనమంతా ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube