మా బాలసుబ్రమణ్యం గారిని అవమానిస్తారా.. ‘పేట్ట’పై ఫ్యాన్స్‌ ఆగ్రహం   SP Balasubrahmanyam Songs In Pets Movie In The Direction Of Anirudh     2018-12-08   10:01:33  IST  Ramesh P

లెజెండ్రీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈమద్య కాలంలో పాటలు పాడటం చాలా వరకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న పాటల్లో సాహిత్యం కంటే ఎక్కువగా చెత్త చెదారం ఉంటుందని, అసభ్యత, డబుల్‌ మీనింగ్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని, అందుకే బాలు గారు పాటలు పాడేందుకు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత రజినీకాంత్‌ నటించిన ‘పేట్ట’ సినిమాలో మరణ.. అంటూ సాగే పాటను ఎస్వీబీతో పాడివ్వడం జరిగింది.

మరణ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనిరుథ్‌ సంగీత సారథ్యంలో ట్యూన్‌ అయిన ఆ పాటకు మంచి స్పందన వస్తున్నప్పటికి విమర్శలు కూడా మొదలయ్యాయి. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పేట్ట చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా తల పట్టుకున్నారు.

SP Balasubrahmanyam Songs In Pets Movie The Direction Of Anirudh-Pets Trolls On Viral About

ఇంతకు వివాదం ఏంటీ అంటే… మరణ పాటలో బాలు గారితో కొన్ని లైన్‌లను మాత్రమే పాడివ్వడం జరిగింది. పాటలోని ఎక్కువ శాతం మరో గాయకుడితో పాడివ్వడం జరిగిందట. పాటలోని కొంత భాగం మాత్రమే బాలుతో పాడివ్వడం అనేది బాలును అవమానించినట్లే అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెజెండ్రీ గాయకుడితో ఒక పాటలోని కొన్ని లైన్స్‌ పాడివ్వడం ఏంటీ అంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే బాలు స్పందిస్తూ.. తాను రజినీకాంత్‌ గారి సినిమాకు చాలా సంవత్సరాల తర్వాత పాట పాడాను. చాలా సంతోషంగా ఉంది. ఎంత పాడినా కూడా అది నాకు సంతోషంగానే ఉంటుందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.