బాలు గొప్ప మనస్సు.. అభిమాని కోసం ఏం చేశాడంటే?

ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది.మరే సింగర్ కు సొంతం కాని అరుదైన రికార్డులు బాలు సొంతం.

 Sp Bala Subramanyam Kindness Towards His Fans  Sp Bala Subramanyam, Death, Cor-TeluguStop.com

మనిషి భౌతికంగా దూరమైనా పాటల రూపంలో బాలు ఎప్పుడూ చెంతనే ఉంటారు.గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా బాలు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

బాలు మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.తాజాగా అభిమాని కోసం బాలు చేసిన పని వెలుగులోకి వచ్చి ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసింది.

పాటలను అమితంగా ప్రేమించే బాలు తాను గొప్ప సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ఒదిగే ఉన్నారు.చిన్నాపెద్దా అనే తేడాల్లేకుండా అందరికీ గౌరవం ఇచ్చే మృదుస్వభావి బాలు.

తాజాగా సోషల్ మీడియాలో బాలు అభిమాని ఒకరు బాలు గొప్పదనాన్ని తెలిపే ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో అభిమాని కోసం బాలు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తనను ఎంతో అభిమానించే కళ్లు లేని అభిమాని గురించి తెలిసి బాలు స్వయంగా వెళ్లి అతనిని కలిశారు.ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.? బాలు ఆ అభిమాని కోసం ఏకంగా దేశం దాటి శ్రీలంకకు వెళ్లి మరీ అభిమానిని కలిసి అభిమానిని ఆశ్చర్యానందంలో ముంచెత్తారు.బాలు పాటలను ఎంతో అభిమానించే ఆ అభిమాని శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో చూపును కోల్పోయాడు.

తన అభిమానుల ద్వారా బాలుకు ఆ అభిమాని తనను కలవాలని అనుకుంటున్నాడని తెలిసింది.అభిమానిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక స్వయంగా అతని ఇంటికి వెళ్లి వెనుక నుంచి అతన్ని తడిమి.

బాల సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడి.ఆ తరువాత తానే బాలసుబ్రహ్మణ్యం అనే విషయాన్ని వెల్లడించాడు.

స్వయంగా బాలు వచ్చి కలవడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఘటనతో పాటు బాలు అభిమానులు ఆయన జీవితంలో అభిమానుల కోసం ఏమేం చేశారనే అనుభవాలను పంచుకుంటూ బాలు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube