యాడ్ మార్కెట్ లో సౌత్ స్టార్స్ దే హవా.. బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ షాక్ అంటూ?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ షాకులు తగులుతున్నాయి.

సౌత్ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండగా బాలీవుడ్ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.

ఏ మాత్రం ఆసక్తిగా అనిపించని కథ, కథనాలతో తెరకెక్కడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.అయితే ఒకప్పుడు యాడ్ మార్కెట్ లో బాలీవుడ్ స్టార్స్ దే పైచేయిగా ఉండేది.

ప్రముఖ కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే యాడ్స్ కోసం ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలను సంప్రదించేవారు.అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.

ప్రస్తుతం యాడ్ మార్కెట్ లో సౌత్ స్టార్స్ హవా కొనసాగుతోంది.బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం కాదని ప్రముఖ యాడ్ కంపెనీలు టాలీవుడ్ స్టార్స్ తో యాడ్స్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

Advertisement

సౌత్ సినిమాలు సక్సెస్ సాధించడం ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా యాడ్స్ లో నటిస్తూ ఆ యాడ్స్ ద్వారా ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు.బాహుబలి2 సక్సెస్ తర్వాత ప్రభాస్ సైతం పలు పాన్ ఇండియా యాడ్స్ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్, బన్నీ, రష్మిక సైతం పాన్ ఇండియా యాడ్స్ లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.కొన్నేళ్ల క్రితం వరకు సౌత్ స్టార్స్ యాడ్స్ లో నటిస్తే కేవలం ఒక భాషకు మాత్రమే వాళ్లు పరిమితం అయ్యేవారు.అయితే ఇప్పుడు మాత్రం అన్ని భాషల్లో సౌత్ హీరోల, హీరోయిన్ల హవా నడుస్తుండటం ముఖ్యంగా తెలుగు హీరోలు యాడ్స్ ద్వారా మెప్పిస్తుండటం గమనార్హం.

సౌత్ స్టార్స్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వరుసగా భారీగా షాకులు ఇస్తుండటం గమనార్హం.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు