కిమ్ కిమ్మనడం లేదేంటి ? ఆయన మరణించాడా ?

తన నియంతృత్వ పోకడలతో, చేష్టలతో ప్రపంచవ్యాప్తంగా నియంతగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది.దేశమంతా పేదరికంతో అల్లాడుతున్నా కిమ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా ఆ దేశ నిధులు మొత్తం అణ్వాయుధాల కోసమే వెచ్చిస్తుండడం పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 International Media Suspects South Korea President Kim Is Dead, South Korea, Kim-TeluguStop.com

అయినా ఆయన మాత్రం తన చర్యలను కొనసాగిస్తూనే వస్తున్నాడు.ఇటీవలే ఉత్తరకొరియాలో పెంపుడు కుక్కలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి అనే వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంపై పెద్ద దుమారమే రేగింది.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక అంశంతో ఆయన వివాదాల్లో చిక్కుకుంటూనే వస్తుంటారు.

తాజాగా ఆయనకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది.

కిమ్ మృతి చెందినట్లుగా అంతర్జాతీయ మీడియా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆధారాలను బయటకు తీస్తోంది.అయితే మరణించడం కానీ కోమాలోకి వెళ్లడం కానీ జరిగి ఉండవచ్చు అనే వార్తలు ఇప్పుడు సంచలనం గా మారాయి.

ఈ తరహా వార్తలు ఇప్పుడు కొత్తేమీ కాదు.గతంలోనే ఆయన మరణించినట్లుగా అనేక వార్తలు రావడం, అప్పట్లో ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకులు ఎవరూ స్పందించక పోవడంతో, ఇదే నిజమని అంతా అభిప్రాయపడగా, అకస్మాత్తుగా ఓ కార్యక్రమానికి కిమ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అయితే ఆ కార్యక్రమంలో పాల్గొంది అతను కాదని, ఆయన పోలికలతో ఉన్న మరో వ్యక్తి అంటూ ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ జర్నలిస్ట్ రాయ్ కేలి, కిమ్ మరణించాడు అనే వాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు.

ఇప్పుడు ప్రపంచం దృష్టి ఈ అంశం పై పడింది.దీనికి తగ్గట్టుగానే కిమ్ సోదరి కిమ్ జోంగ్ ఇల్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుతో పాటు, త్వరలోనే ఆమె ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది.

కిమ్ మరణించాడు కాబట్టే ఆమె సోదరి యాక్టివ్ అయ్యారు అనే వార్తలు అంతర్జాతీయ మీడియా వ్యక్తం చేస్తోంది.

త్వరలోనే ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అంటూ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రచారం చేస్తున్నా, ఉత్తర కొరియా అధికారిక మీడియా కానీ, ఆ పార్టీ నాయకులు స్పందించకపోవడంతో, ఇదే నిజమనే అభిప్రాయంలో ప్రపంచ సమాజం ఉంది.

నిజంగా కిమ్ మరణిస్తే ఇప్పటి వరకు నియంత పాలనలో ఉంటూ వచ్చిన అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube