సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ద‌క్షిణ కొరియా.. ఇక‌పై ఆ మాంసం తినొద్ద‌ట‌..

ఒక్కో దేశంలో ఆహార నియ‌మాలు అనేవి ఒక్కో ర‌కంగా ఉంటాయి.ఆ ప్రాంతంలో పండేవాటిని ఆధారంగా చేసుకుని అక్క‌డి వారు ఆహార ప‌దార్థాల‌ను అల‌వాటు చేసుకుంటారు.

 South Korea Has Made A Sensational Decision To Stop Eating That Meat Anymore , S-TeluguStop.com

ఇక మ‌న ద‌గ్గ‌ర ఎలాగైతే అన్నం లేదంటే రొట్టెలు తింటామో అలాగే దక్షణి కొరియాలో కూడా కొన్ని ఆహార నియ‌మాలు అనేవి ఉన్నాయి.అయ‌తే ఇప్పుడు ఆ దేశంలో ఓ ఆహార నియ‌మంపై ప్రెసిడెంట్‌ మూన్‌ జే-ఇన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక నుంచి ద‌క్షిణ కొరియాలో ఎవ‌రూ కూడా కుక్క మాంసం తినడానికి వీల్లేద‌ని, దాన్ని శాశ్వ‌తంగా నిషేదిస్తున్నట్లు సోమవారం ప్ర‌క‌టించారు.

నిజానికి కుక్క మాంసం అనేది ఎంతో కాలంగా దక్షిణ కొరియాలో ప్ర‌దాన వంటకాలలో ఒక‌టిగా ఉంటోంది.

ఈ దేశంలో సంవత్సరానికి దాదా ఒక మిలియన్‌ కుక్కల‌ను ఆ దేశ‌స్తులు తింటున్నారంటే దానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే మారుత‌న్న కాలాన్ని బ‌ట్టి మ‌నుషుల‌తో పాటు ఇండ్ల‌లో పెంపుడు జంతువులను కూడా పెంచుకోవ‌డం, వాటిపై ప్రేమ‌ల‌ను పెంచుకుని సహచరులుగా చూస్తున్నందున రాను రాను కుక్క మాంసం వినియోగం బాగా త‌గ్గుతోంది.

దీంతో దీనిపై ప్రధానమంత్రి కిమ్‌ బూ-క్యూమ్ ఇలా ప్ర‌క‌టించేశారు.

త‌మ దేశంలో కుక్క మాంసం వినియోగం ఆపేయాలంటూ ఎప్ప‌టి నుంచో డిమాండ్లు వ‌స్తున్నాయ‌ని, ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు కూడా త‌మ‌కు ఎన్నో సార్లు విన్న‌విస్తున్నార‌ని, ఇక తాను కూడా జంతు ప్రేమికుడినే కావ‌డం కూడా ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు.

ఇక దేశ వ్యాప్తంగా ఓ స‌ర్వే నిర్వ‌హించ‌గా అందులో 78% శాతం మంది కుక్కల‌దో పాటుగా పిల్లుల వ‌ధ‌ను తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని తెలుస్తోంది.కాగా దేశఃలో మాంసం అమ్మే వ్యాపారాలు చేస్తున్న వారు త‌మ బిజినెస్‌లు దెబ్బ‌తింటాయ‌ని, త‌మ జీవనోపాధి ప్రమాదంలో ప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube