ఒక డాక్టర్‌ పొరపాటున చేసిన పనికి తల్లి కావాల్సిన ఆమె జీవితం నాశనం అయ్యింది

దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్‌ ఆ ప్రాణం కాపాడుతాడు.కొన్ని సందర్బాల్లో దేవుడి కంటే డాక్టర్‌ గొప్ప వాడు అంటారు.

 South Korea Doctor Did Wrong Performs To The Pregnant Lady-TeluguStop.com

ప్రమాదంలో ఉన్న వ్యక్తిని డాక్టర్‌ మాత్రమే కాపాడగలడు.ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వృత్తిగా వైధ్య వృత్తికి పేరు ఉంది.

అలాంటి వైద్య వృతిలో ఉండి కొందరు అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ మనుషుల ప్రాణాలను తీయడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.డాక్టర్లు చాలా జాగ్రత్తగా శ్రద్దగా తమ పని చేయాల్సి ఉంటుంది.

కాని కొందరు డాక్టర్లు అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తారు.గతంలో ఆపరేషన్స్‌ సమయంలో సీజర్స్‌, కాటర్స్‌ ఇలా పలు వస్తువులను కడుపులో లేదా మరో చోట ఉంచి ఆపరేషన్‌ చేసిన సంఘటనలు ఉన్నాయి.

Telugu Korea, Telugu Nri Ups, Telugu Ups, Perms-Telugu NRI

  తాజాగా సౌత్‌ కొరియలో ఒక డాక్టర్‌ చేసిన పనికి జీవితాంతం సంతోషంగా గడపాలని కోరుకుంటున్న ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్లే కొన్ని కారణాల వల్ల భర్తను కోల్పోయిన మహిళ భర్త జ్ఞాపకాలను తన కడుపులో మోస్తూ ఉంది.భర్త లేని లోటును పుట్టబోయే బిడ్డలో చూసుకుంటూ జీవితాంతం గడిపేయాలనుకుంది.భర్త మృతి నుండి కోలుకుంటూ పుట్ట బోయే బిడ్డ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్న ఆమె ఇటీవల ఒక హాస్పిటల్‌కు జనరల్‌ చెకప్‌కు వెళ్లింది.

ఆ సమయంలో డాక్టర్‌ పొరపాటున ఆమెకు అబార్షన్‌ అయ్యే ఇంజెక్షన్‌ ఇచ్చాడు.

Telugu Korea, Telugu Nri Ups, Telugu Ups, Perms-Telugu NRI

  అసలు విషయం ఏంటంటే ఆ సమయంలోనే మరో మహిళకు అబార్షన్‌ ఇంజెక్షన్‌ వేయాల్సి ఉంది.కాని డాక్టర్‌ అశ్రద్దతో ఆమెకు వెయాల్సిన ఇంజెక్షన్‌ ఈమెకు వేయడం జరిగింది.దాంతో ఈమె ఇంటికి వెళ్లిన కొద్ది సమయంకు విపరీతమైన నొప్పి వచ్చి బ్లీడింగ్‌ అయ్యి గర్బస్రావం అయ్యింది.

గర్బస్రావం సమయంలో ఆమె చనిపోయే పరిస్థితి ఏర్పడింది.అదృష్టవశాత్తు ఆమె ప్రాణాల నుండి బయట పడింది.

Telugu Korea, Telugu Nri Ups, Telugu Ups, Perms-Telugu NRI

  గర్బస్రావంకు కారణం అయిన డాక్టర్‌ మరియు హాస్పిటల్‌పై సదరు యువతి కేసు వేసింది.కోర్టు ఆ హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు డాక్టర్‌కు జైలు శిక్ష విధించింది.జీవితంను ఎంతో ఊహించుకుని ఆనందంగా గడపాలని భావించిన ఆమెకు డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా దారుణమైన సంఘటన జరిగింది.ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషాదంగా ఉంది.ఆమె భర్తను కోల్పోయి పుట్టబోయే బిడ్డను కోల్పోయింది.ఆమె కన్నీరు మున్నీరు అవ్వడంతో స్థానికంగా ఆమె విషయం అందరికి కన్నీరు పెట్టిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube