ప్రస్తుతం సినిమా కంటే.సినిమా ప్రమోషనల్ వీడియోస్ కు దక్కిన ఆదరణతోనే సినిమా ఏ పాటి హిట్ కొడుతుందో చెప్తున్నారు సినీ జనాలు.
బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాలంటే సోషల్ మీడియాలో దుమ్మురేపాలి అనుకుంటున్న సినిమా దర్శక నిర్మాతలు.అందులో భాగంగానే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తున్నారు.
అయితే సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ మాత్రం సోషల్ మీడియాలో దూకుడుగా కొనసాగుతున్నాడు ఆయన సినిమాల ప్రమోషన్ వీడియోలు, సినిమాలు సైతం ట్రెండింగ్ లో నిలివడంతో పాటు అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించుకుంటున్నాయి.

ప్రస్తుతానికి విజయ్ ని లైక్స్ విషయంలో ఢీకొట్టే మరో హీరో లేడని చెప్పుకోవచ్చు.ఇంతకీ ఆయన టీజర్లకు యూట్యూబ్లో వచ్చిన లైక్స్ ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్నాయి.ట్విట్టర్ లో మోస్ట్ లైక్సస్ ని సొంతం చేసుకున్న ట్వీట్స్ విషయంలో ఇండియాలో ఏ హీరో కూడా ఆయన దరిదాపుల్లో లేడు.
సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ టైంలో విజయ్ లైక్స్ రేంజ్ మరే హీరోకు అందనంత స్థాయిలో ఉన్నాయి.ట్విట్టర్ లో ఫస్ట్ లుక్స్ విషయంలో హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకున్న టాప్-5 ట్వీట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మాస్టర్ – 305.4 K
*బీస్ట్- 299 K*బిగిల్ – 287 K*లాల్ సింగ్ చంద్ – 201 K*మార్షష్- 191K

వీటలో ఒక్క హిందీ సినిమా మినహా మిగతా నాలుగు సినిమాలు విజయ్ వే కావడం విశేషం.ఆయన తాజా ట్రైలర్ బీస్ట్ 3 లక్షల లైక్స్ ని పొందింది.త్వరలో మాస్టర్ లుక్ లైక్స్ రికార్డును బద్దలు కొట్టనుంది.
హైయెస్ట్ లైక్సస్ సంపాదించుకున్న లుక్ గా రికార్డు కొట్టనుంది.మొత్తంగా సౌత్ ఇండియన హీరో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ముందుకు సాగుతున్నాడు.