స్టేషన్లు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. ఎందుకంటే.. ??

దక్షిణ మధ్య రైల్వే రెండు రాష్ట్రాల్లో కలిపి 31 రైల్వే స్టేషన్లు మూసివేందుకు సిద్దం అవుతుందట.ఈ క్రమంలో మూసివేసే స్టేషన్లు అన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉండటం ఆశ్చర్యకరం.

 South Central Railway, Stations, Temporarily, Closed, South Central Railway Stat-TeluguStop.com

కానీ ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ లో ఉందట.ఇక డివిజన్ల వారీగా మూతపడే స్టేషన్లను పరిశీలిస్తే.

సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్ 7 స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కాగా మూసివేసే ఆయా స్టేషన్ల నుండి సరైన ఆదాయం రావడం లేదని, ఈ కారణంగా మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతబడుతుండగా, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతబడుతాయని అధికారులు పేర్కొంటున్నారు.ఇలా రైల్వే స్టేషన్లను మూసి వేస్తున్నట్లుగా అకస్మాత్తుగా ప్రకటించడంతో ప్రస్తుతం ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube