నియంత పాలనకు తెర: సురినామ్ దేశాధ్యక్షుడిగా భారత సంతతి నేత

ప్రపంచ రాజకీయాల్లో భారతీయులు, భారత సంతతి ప్రజలు సత్తా చాటుతున్నారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి సమాజంలో కలిసిపోయి రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.

 South America, Suriname, Elections, Chan Santokhi, Dutch Colony, Netherlands, Ch-TeluguStop.com

తాజాగా దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశం సురినామ్‌లో నియంత పాలనకు తెరదించుతూ భారత సంతతి నేత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మాజీ పోలీస్ చీఫ్, ప్రొగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ (పీఆర్‌పీ) నేత చాన్ సంతోకి ఘన విజయం సాధించారు.

సంతోకి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు.దేశాధ్యక్షుడు, నియంత బౌటర్సేపై హత్యారోపణలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా‌కు పాల్పడినట్లుగా తేలడంతో ఆయనపై దేశ ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

Telugu Chan Santokhi, China, Dutch Colony, Netherlands, America, Suriname-

మరోవైపు అధ్యక్షుడిగా చాన్ సంతోకి అనేక సవాళ్లు ఎదుర్కోనున్నారు.ప్రస్తుతం దేశం దివాళా స్థితిలో ఉంది.వ్యవస్థలో పెరిగిపోతున్న అవినీతితో పాటు ఓ వైపు ముంచుకొస్తున్న కరోనా ముప్పును సంతోకి ఎదుర్కోవాల్సి వుంది.కాగా సురినామ్‌లో ఇప్పటి వరకు 780 మందికి కరోనా సోకగా.

వీరిలో 18 మంది మరణించారు.ఒకప్పుడు డచ్ కాలనీగా ఉన్న సురినామ్‌కు దౌత్య, వ్యాపార భాగస్వామిగా ఉన్న నెదర్లాండ్స్‌తో సంబంధాలు బౌటర్సే పాలనీలో క్షీణించాయి.నెదర్లాండ్స్‌ను కాదని ఆయన చైనాతో పాటు సమీప దేశం వెనిజులాతో సన్నిహితంగా మెలుగుతున్నారు.61 ఏళ్ల చాన్ సంతోకి జూలై 16న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సురినామ్ ప్రత్యేకతలు: అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో ఉన్న ఈ దేశం దక్షిణ అమెరికా దేశాలన్నింటిలోనూ వైశాల్యం, జనాభా పరంగా చిన్నది.ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది.

అమెజాన్ ప్రాంతాల్లోని స్థానిక తెగ ‘ సురినెన్’ పేరు మీదుగా ఈ దేశానికీ ‘‘ సురినామ్ ’’ అనే పేరొచ్చింది.ఈ దేశ అధికార భాష డచ్.హిందుస్థానీ తెగల వారు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube