దేవుడా: ఒకేసారి 10 మందికి జన్మనిచ్చి గిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళ..!

కవల పిల్లలకు జన్మనివ్వడమంటేనే పెద్ద సాహసం.అలాంటిది.

 South African Women Gave Birth To Ten Babies Get Gunnies World Record , 10 Membe-TeluguStop.com

ఓ మహిళ ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 10 మంది పిల్లలను ఒకే కాన్పులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ఈ ఘనత సాధించకపోవడంతో ఆమె వరల్డ్ రికార్డు ఖాతాలో చోటు సంపాదించే అవకాశాలున్నాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ ఈ ఘనత సాధించినట్లు తెలిసింది.మే 7న ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది పిల్లలకు జన్మనిచ్చింది.

ప్రసవం కష్టం కావడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమె కడుపులోని బిడ్డలను బయటకు తీసినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.సిథోల్‌కు ఇప్పటికే కవల పిల్లలు ఉన్నారు.

రెండో కాన్పులో ఆమెకు ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.అయితే, సిథోల్ వారిని సాధారణ విధానంలోనే ప్రసవించినట్లు తెలపడంతో సందేహాలు నెలకొన్నాయి.

దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.ప్రసవానికి ముందు జరిపిన పరీక్షల్లో ఆమె కడుపులో ఆరుగురు పిల్లలే పెరుగుతున్నారని భావించారు.

అయితే, ప్రసవం సమయంలో పది మంది పిల్లలు కనడంతో ఆశ్చర్యపోయారు.

అంతమంది పిల్లలను కనడం మాటలు కాదని.

గర్భంతో ఉన్నప్పుడు తన కాళ్లు విపరీతంగా నొప్పి, గుండెల్లో మంటగా ఉండేదని తెలిపింది.అంతేగాక, తన పిల్లలు ప్రాణాలతో ఉండరేమోనని భయపడేదానినని ఆమె పేర్కొంది.

Telugu Member Born, Guinness, Pregnant, African, Latest-Latest News - Telugu

అయితే, పిల్లలంతా సురక్షితంగానే ఉన్నారని, కొన్ని నెలలు వారిని ఇన్‌క్యూబేటర్‌లో ఉంచి పర్యవేక్షించాల్సి ఉందని స్థానిక మీడియా తెలిపింది.అయితే, ఈ ఘటనను హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.ఈ సందర్భంగా సిథోల్ భర్త టెబాహో మాట్లాడుతూ తన భార్య ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు.ఆమెకు పిల్లలు ఆరోగ్యంగా పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక పిల్లలను ప్రసవించిన రికార్డు హలీమా సిస్సే పేరు మీద ఉంది.ఆమె ఒకేసారి తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది.

ఈమె కంటే ముందు సిస్సే అనే మహిళ 2009 సంవత్సరంలో ఒకేసారి ఎనిమిది మంది పిల్లలను ప్రసవించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube