వైరల్.. అయ్యో.. పాపను బిల్డింగ్ పైనుండి విసిరేసిన తల్లి.. ఎందుకంటే ?

బిడ్డలు ఆపదలో ఉన్నారంటే ఆ తల్లి విలవిలా లాడుతుంది.తన ప్రాణాలు అడ్డు పెట్టి మరి పిల్లల ప్రాణాలను కాపాడు కుటుంది.

 South African Mother Throws Daughter From Burning Building Into The Arms Of Pass-TeluguStop.com

మరి అలాంటి కన్న తల్లి తన బిడ్డ ప్రాణాలను ఎందుకు తీస్తుంది అని అనుకుంటున్నారా.అయితే ఆమె తన బిడ్డను బిల్డింగ్ మీద నుండి పడేసింది ప్రాణాలు తీయడానికి అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

ఆమె ప్రాణాలు తీయడానికి తన బిడ్డని బిల్డింగ్ మీద నుండి విసిరి వేయలేదు.

ఆమె అలా తన బిడ్డను బిల్డింగ్ మీద నుండి విసిరేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే ఆమె అలా ఎందుకు చేసిందో ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.అలా బిల్డింగ్ మీద నుండి బిడ్డను విసిరేయడం వల్ల ఆ బిడ్డ ఎలా ఉందొ అని అనుకుంటున్నారా.

అసలు ఏం జరిగిందంటే.దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఆందోళకారులు ఒక బిల్డింగ్ కు నిప్పు పెట్టారు.

అలా నిప్పు అంటించడంతో ఆ బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు అంటుకున్నాయి.

అలా అంటుకోవడంతో ఆ బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళు అందులో నుండి బయట పడేందుకు మార్గం లేకపోవడంతో భయాందోళనకు గురి అయ్యారు.అందులోనే ఉన్న ఒక మహిళ ఆ బిల్డింగ్ కిటికీ నుండి స్లాబ్ మీదకు దూకి ఆ తర్వాత తన బిడ్డను కూడా ఎవరో బయటకు ఇవ్వడంతో క్యాచ్ పట్టుకుంది.

ఆ వెంటనే ఆమె తన బిడ్డను అక్కడ బిల్డింగ్ మీద నుండి కిందకు విసిరేయడానికి ట్రీచ్ చేస్తుండడంతో అటు వైపు వెళ్తున్న జనం ఆ బిడ్డను కింద పడకుండా పట్టుకుని కాపాడారు.ఆ తర్వాత ఆమె కూడా ఆ బిల్డింగ్ పై నుండి దిగి కిందకు వచ్చి తన బిడ్డ క్షేమంగా ఉండడంతో సంతోషంగా హత్తుకుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.

https://twitter.com/nomsa_maseko/status/1414945491788435458

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube