టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా...అప్పుడే 2 వికెట్లు కోల్పోయింది  

South Africa Won The Toss And Choose To Bat-

ప్రపంచ కప్ లో అసలు పరీక్ష ఈ రోజే ప్రారంభమైంది.నిన్నటి నుంచి ప్రతిఒక్కరూ ఏంతో ఆసక్తిగా ఎదురుకి చూస్తున్న మ్యాచ్ టీమిండియా,దక్షిణాఫ్రికా మ్యాచ్.అయితే కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎంచుకుంది..

South Africa Won The Toss And Choose To Bat--South Africa Won The Toss And Choose To Bat-

అయితే తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు బాగానే రాణించారు.తోలి రెండు ఓవర్ల లోనే సౌతాఫ్రికా కీలక ఆటగాడు ఆమ్లా వికెట్ ని కోల్పోయింది.బుమ్రా బౌలింగ్ లో ఆమ్లా రోహిత్ కు క్యాచ్ ఇవ్వడం తో పెవిలియన్ నుంచి వెనుదిరిగాడు.

తరువాత మళ్లీ బుమ్రా బౌలింగ్ లోనే డీకాక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు.

దీనితో నిర్ణీత 16 ఓవర్ల లో సౌతాఫ్రికా 57/2 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది.విరాట్ కోహ్లీ సారధ్యంలో తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ఆడుతుంది.దీనితో ఈ ప్రపంచ కప్ ను కొట్టాలని విరాట్ భావిస్తున్నాడు.

2011 లో ధోని సారధ్య భాద్యతలు చేపట్టి టీమిండియా కు ప్రపంచ కప్ ని అందించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సారి ప్రపంచ కప్ లో ధోని సలహాలు,సూచనల తో విరాట్ ప్రపంచ కప్ ని మరోసారి భారత్ కు అందించాలని కృతనిశ్చయం తో ఉన్నాడు.