సౌతాఫ్రికా సిరీస్: టీమిండియాకు మరో చిక్కు.. వైస్‌కెప్టెన్ బాధ్యతలు దక్కేదెవరికి..?

డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికా, టీమ్ ఇండియా జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.భారత క్రికెటర్ ఆటగాళ్ళందరూ డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకి చేరుకోనున్నారు.

 South Africa Series: Another Tough Vice-captain For Teamindia South Africa , Ser-TeluguStop.com

ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఇంకా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే ఒక కొత్త సమస్య వచ్చి పడింది.టెస్ట్ జట్టు వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ తొడ గాయంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అయితే అతడు టెస్టుకు దూరమయ్యాక ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో తెలియక టీమిండియా సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు.

ప్రస్తుతం లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, ఛతేశ్వర్ పుజారాలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.

అయితే రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా కూడా వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాలని ఆసక్తి చూపిస్తున్నారు.మరోవైపు ఇప్పటికే చాలాసార్లు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానె కూడా ఈ రేస్ లోకి వచ్చి చేరాడు.

అయితే చివరికి ఎవరిని ఫైనలైజ్ చేయాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు సెలక్టర్లు.

Telugu Africa, India-Latest News - Telugu

లోకేష్ రాహుల్ ఇప్పటి వరకు మొత్తం 40 టెస్టు మ్యాచులు ఆడాడు.వీటిలో 12 అర్థసెంచరీలు, 6 సెంచరీలు సాధించాడు.కెప్టెన్సీ విషయానికొస్తే అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

అయితే ఈ విషయాలను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు.లోకేష్ కు గట్టి పోటీ ఇస్తున్న రిషబ్ పంత్ ఐపీఎల్లో ఢిల్లీకి సారథిగా వహించి చాలా విజయాలు అందించాడు.

ఈ అంశం ఇప్పుడు అతడికి కలిసి రావచ్చు.పూజారా వంటి సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు కానీ వారు ఫామ్ లో లేరు.

దీనితో వారు వైస్ కెప్టెన్ బాధ్యతలను చేజిక్కించుకునే అవకాశాలు చాలా తక్కువ.అశ్విన్, బుమ్రా సంగతి అటుంచితే సౌతాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు రహానెని వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి చివరికి ఎవరిని ఎంపిక చేస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube