పంత్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆ ప్లేయర్.. ఎలా సమాధానం ఇచ్చాడంటే

South Africa And India Test Series Update

దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ లో భాగంగా పేస్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ ఒక పిచ్చి పని చేశాడు.

 South Africa And India Test Series Update-TeluguStop.com

నిజానికి అతడు టీమిండియా ఆటగాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు.గతంలో బుమ్రాతో గొడవకు దిగి తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా రిషభ్ పంత్‌తో కయ్యానికి కాలుదువ్వాడు.అయితే ఎప్పుడూ ఉడుకు రక్తంతో ఉండే రిషభ్ పంత్ అనూహ్యంగా స్పందించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 South Africa And India Test Series Update-పంత్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆ ప్లేయర్.. ఎలా సమాధానం ఇచ్చాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో రిషభ్ పంత్‌ స్కోరు పెంచేందుకు ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేశాడు.ఈ సమయంలో అనేక బంతులను డిఫెండ్ చేశాడే తప్ప ఏ షాట్ ఆడలేదు.

ఈ క్రమంలో మార్కో జాన్సెన్‌ షార్ట్‌ పిచ్‌ బంతి బౌల్ చేయగా దాన్ని కూడా పంత్‌ డిఫెన్స్‌ ఆడాడు.దీంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న సదరు బౌలర్ బంతిని పంత్‌వైపు విసిరి తన ఆగ్రహం వెళ్లగక్కాడు.

అసలే ఉడుకురక్తంతో ఉండే పంత్‌తో కయ్యానికి కాలు దువ్వడంతో ఆ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు.కానీ పంత్ మాత్రం చాలా శాంతంగా స్పందించాడు.

మార్కో జాన్సెన్‌ విసిరి కొట్టిన బంతికి బ్యాట్ అడ్డుగా పెట్టుకొని తనని కాపాడుకున్నాడు.అంతకుమించి పంత్ విరుద్ధంగా ఏం చేయలేదు.

దాంతో అందరూ అవాక్కవుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే రిషభ్ పంత్ అదునుచూసి మార్కో జాన్సెన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇస్తాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దక్షిణాఫ్రికా 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది.ఇప్పటికే ఎల్గర్‌(30), మార్కం(16) ఔటయ్యారు.ప్రస్తుతం క్రీజ్‌లో కీగన్‌ పీటర్సన్‌ (48) ఉండగా.ఇప్పుడు సౌతాఫ్రికా స్కోరు 101 పరుగులుగా ఉంది.అయితే టాప్ ప్లేయర్లు ఔట్ అయ్యాక మార్కో జాన్సెన్‌ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

ఈ సమయంలో వికెట్ల వెనకాల కీపర్‌గా ఉండే పంత్‌ ఏదో ఒక పని చేసి మార్కో జాన్సెన్‌కు బుద్ధి వచ్చేలా సరైన సమాధానం చెప్తాడని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పుడు దక్షిణాఫ్రికా మరో 111 పరుగులు చేస్తే గెలవడం ఖాయం.

టీమిండియా గెలవాలంటే ఈరోజు వారందరినీ ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.

#Response #Risab Panth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube