ఐసీసీ గిరికి గంగూలీ కరెక్ట్ అంటున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్

ప్రపంచ క్రికెట్ ని రూల్ చేస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ మీద ఇండియా పెత్తనం ఎక్కువగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే.ఇక ఐసీసీ సభ్య దేశాలలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అంటే బీసీసీఐ అని చెప్పాలి.

 Sourav Ganguly Is The Right Man To Become Icc Chairman, Bcci, Lock Down, Corona-TeluguStop.com

ఇక ఐపీఎల్ సిరీస్ ద్వారా బీసీసీఐ భారీగానే అర్జిస్తుంది.అలాగే ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఫాలోయింగ్ తో ఎక్కువ ఆదాయం సొంతం చేసుకుంటుంది.

ఇండియాలో అత్యంత ఖరీదైన క్రీడ అంటే క్రికెట్ అని చెప్పాలి.అలాంటి క్రికెట్ బోర్డుకి ఇప్పుడు ఒకప్పటి టీం ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రెసిడెంట్ గా ఉండి నడిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఇండియన్ అయిన శశాంక్ మనోహర్ ఉన్నారు.

ఇక ఆయన పదవీకాలం ముగియడంతో నెక్స్ట్ ఐసీసీ బాద్యతలు చేపట్టేది ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తుంది.

లాక్ డౌన్ తర్వాత క్రికెట్ మ్యాచ్ లు కొనసాగించడం, ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడం కత్తిమీద సాము లాంటిది.వీటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంటే సౌరవ్ గంగూలీ బెస్ట్ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నారు.

సౌరవ్ గంగూలీ కంటే ఎవ్వరూ గొప్పవారు కాదని.కష్టతరమైన సందర్భంలో గంగూలీ మాత్రమే ఈ పగ్గాలు చేపట్టగలడని గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఒక టెలి-వీడియో సమావేశంలో, గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ, ఐసిసి ప్రెసిడెంట్ పదవిలో ఎవరైనా సరే సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యమని.కరోనా వైరస్ తరువాత, ఆధునిక క్రీడలకు దగ్గరగా మరియు నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉన్న బలమైన నాయకుడు ఐసిసికి అవసరం అని అన్నారు.

మరి గ్రేమ్ స్మిత్ అభ్యర్ధన మేరకు ఐసీసీ పగ్గాలు అందుకోవడానికి గంగూలీ సిద్ధంగా ఉంటాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube