సూప్స్‌.. సలాడ్స్‌ తీసుకుంటే ఆరోగ్యమేనా?

బరువు నుంచి తగ్గించుకునే పనిలో పడినపుడు.ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు.

 Soups And Salads How Best For Health-TeluguStop.com

ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్‌ ముఖ్యంగా చిప్స్, ఫ్రైడ్‌ స్నాక్స్‌ వంటివి తీసుకోలేక పోతారు.దానికి బదులుగా సూప్స్, సలాడ్స్‌ వంటివి తీసుకుంటారు.

ఎందుకంటే డైట్‌లో ఉన్నప్పుడు ఇవి ఆరోగ్యకరమైన ఫుడ్‌గా పరిగణిస్తారు.కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ సూప్స్‌ అండ్‌ సలాడ్స్‌ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఛాయిస్‌ కాదని అంటున్నారు.

 Soups And Salads How Best For Health-సూప్స్‌.. సలాడ్స్‌ తీసుకుంటే ఆరోగ్యమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటిని తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.ప్రముఖ న్యూట్రిషియనిస్ట్‌ బీ హెగ్డే ఓ వార్త పత్రికకు సూచనలు చేశారో తెలుసుకుందాం.

సూప్స్, సలాడ్స్‌ మూడు పూటల తీసుకుంటే… ఇది బ్యాలన్స్‌డ్‌ ఫుడ్‌ అవ్వదని కాదు.వీటిని కేవలం బ్రేక్‌ఫస్ట్‌ లేదా డిన్నర్‌ సమయంలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నానన్నారు.లంచ్‌ సమయంలో కార్బొహైడ్రేట్స్‌ అధికంగా ఉండే ఆహారం రైస్, గోధుమ, జొన్న లేదా మిల్లెట్స్‌ తీసుకోవడం మేలని చెప్పారు.సూప్స్, సలాడ్స్‌ వెయిట్‌ లాస్‌ త్వరగా అవ్వలనుకునే వారికి చాలా మంచివని చెప్పారు.

ముఖ్యంగా మష్రూమ్స్‌ సూప్, బ్రొకోలి సూప్, మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ సూప్‌ వంటి థిక్‌ సూప్‌లను తీసుకోవాలి.ఈ సూప్స్‌తో మీకు మరింత బెనిఫిట్‌ పొందాలంటే వీటిలో చక్కెర, తేనె, కార్న్, బట్టర్‌ యాడ్‌ చేయకపోతే మంచిది.

ఎందుకంటే వీటిలో ఎక్కువ స్థాయిలో క్యాలరీస్‌ ఉంటాయి.అంతేకాదు మయోనైజ్‌ వంటి టాపింగ్స్‌ యాడ్‌ చేయడంతో అధిక క్యాలరీలు యాడ్‌ చేయడమేనని ఆమె అన్నారు.

మనం ఏ కారణంగా సలాడ్స్‌ తీసుకుంటున్నామో అది వ్యర్థమవుతుంది.

Telugu Balanced Food, Benefits Of Salads, Braccoli Salad, Calories, Fruit Salad, Mixed Vegetable Soup, Mushroom Soup, Soups, Vegetable Salad, Weight Loss-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అయితే, సలాడ్స్‌ మరింత రుచికరంగా ఉండాలంటే.కాస్త లెమన్‌ జ్యూస్, ఉప్పు యాడ్‌ చేస్తే సరిపోతుంది.ఇంకా పనీర్, తొఫు, సోయా చంక్స్‌ కలిపి తీసుకుంటే మరింత న్యూట్రిషియన్‌ అందుతుందట.

వెయిట్‌ లాస్‌ అవ్వడానికి తీసుకునే ఆహారంలో ప్రోటిన్స్, కార్బొమైడ్రేట్స్, వెజిటేబుల్స్‌ స్థాయిని కొలతలతో తీసుకోవాలి.సూప్స్, సలాడ్స్‌ ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో ఫుడ్, లైఫ్‌స్టైల్‌ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ భార్గవ ఇంస్టాగ్రాంలో వేదికగా తెలిపారు.

సూప్స్, సలాడ్స్‌ సరైన పద్ధతిలో తీసుకుంటేనే శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్‌ అందుతాయని చెప్పారు.

Telugu Balanced Food, Benefits Of Salads, Braccoli Salad, Calories, Fruit Salad, Mixed Vegetable Soup, Mushroom Soup, Soups, Vegetable Salad, Weight Loss-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

సూప్‌లో వాడే వెజిటేబుల్స్‌ ఫ్రెష్‌గా కట్‌ చేసుకోవాలి.వాటిని వెంటనే తీసుకోవాలి.
– సలాడ్‌లో ప్రోటిన్స్‌ అధికంగా ఉండే బీన్స్, పప్పులు, తోఫు, పనీర్, గుడ్లు, చికెన్, ఫిష్‌ ఉండేలా చూసుకోవాలి.
– నట్స్, సీడ్స్‌ వంటివి కలిపి తీసుకోవాలి.
కార్న్‌ స్టార్చ్‌ లేకుండా ఉండటమే మేలు.

#Braccoli Salad #Calories #Benefits Salads #Soups #Vegetable Salad

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు