మళ్ళీ తెరపైకి సౌందర్య బయోపిక్... హీరోయిన్ ఎవరంటే

మహానటి సావిత్రి తర్వాత వెండితెరపై ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటి ఎవరంటే సౌందర్య అని చెప్పాలి.కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు అమ్మాయి అనే స్థాయిలో ప్రతి ఒక్కరికి తన పెర్ఫార్మెన్స్ తో రీచ్ అయిపొయింది.

 Soundarya Biopic Will Coming Soon-TeluguStop.com

ఎక్కువగా తెలుగు నేటివిటీ ఉన్న పాత్రలలో నటించి మెప్పించింది.ఫ్యామిలీ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా సౌందర్య ఒకానొక దశలో మారిపోయింది.

ఇక స్టార్ హీరోల నుంచి అప్పటి యంగ్ హీరోల వరకు అందరూ కూడా సౌందర్యతో ఆడిపాడటానికి ఎదురుచూసేవారు.మాయలోడు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసింది.

 Soundarya Biopic Will Coming Soon-మళ్ళీ తెరపైకి సౌందర్య బయోపిక్… హీరోయిన్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత తమిళంలో చేసింది.అందుకే తెలుగు ప్రజలు సౌందర్యని ఇప్పటికి సావిత్రితో పోల్చి చెబుతూ ఉంటారు.

అయితే పెళ్లి తర్వాత ఆమె విమాన ప్రమాదంలో మృతి చెందడం యావత్ తెలుగు ప్రజలని కలచివేసింది.ఇదిలా ఉంటే మహానటి బయోపిక్ టాలీవుడ్ లో తెరకెక్కి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో గతంలో సౌందర్య బయోపిక్ గురించి చర్చ నడిచింది.కీర్తి సురేష్ ని సంప్రదించారనే టాక్ కూడా వినిపించింది.అయితే అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు.అయితే సౌందర్య బయోపిక్ తెరకెక్కించడానికి ఓ బడా నిర్మాత తెరవెనుక ప్లాన్ చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు మరోసారి ఆ బయోపిక్ గురించి టాలీవుడ్ లో హాట్ న్యూస్ వైరల్ అవుతుంది.బయోపిక్ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది.

ఇక సౌందర్య పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మికలలో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

#Keerthi Suresh #Sai Pallavi #Savitri Biopic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు