షేవింగ్ చేస్తుండ‌గా గొంతు తెగింది.. అస‌లు ట్విస్టు తెలిస్తే..

కొన్ని వీడియోలు అంతే మ‌న కండ్ల‌ను కూడా మోసం చేస్తుంటాయి.నెట్టింట నిత్యం వైర‌ల్ అయ్యే వాటిలో కొన్ని సమాచారాన్ని అందించేవి అయితే మరికొన్ని మాత్రం మ‌న‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

 Sore Throat While Shaving If You Know The Real Twist-TeluguStop.com

ఈ మ‌ధ్య యూట్యూబ్‌ ఛానల్‌ల హ‌వా పెరిగిన‌ప్ప‌టి నుంచి ప్రాంక్‌ వీడియోలు ఓ ట్రెండ్ గా మారిపోయాయి.ఏదో ఒక విధంగా అవ‌త‌లి వారిఇన ఫూల్‌ను చేయ‌డం ఇందులో మ‌నం చూడొచ్చు.

ఇక ఇలాంటి ఫ్రాంక్ వీడియోల‌ను చూస్తే గ‌న‌క జనాలు భయాందోళనకు గుర‌వుతుంటారు.ఇక ఇక ఇప్పున‌డు కూడా ఇలాంటి ఓ భ‌యంక‌ర‌మైన వీడియో గురించి తెలుసుకుందాం.

 Sore Throat While Shaving If You Know The Real Twist-షేవింగ్ చేస్తుండ‌గా గొంతు తెగింది.. అస‌లు ట్విస్టు తెలిస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వీడియోను చూస్తే గ‌న‌క నిజంగానే ఫ్యూజులు ఎగిరిపోతాయేమో అనిపిస్తుంది.ఇక ఇందులో చూస్తే ఓ వ్యక్తి షేవింగ్ కోసం ద‌గ్గ‌ర్లోని సెలూన్ షాప్‌కు వ‌స్తాడు.

ఇక అత‌న్ని ఆట ప‌ట్టించేందుకు ఆ షాపు వ్య‌క్తి ఓ ప్లాన్ వేస్తాడు.ఇక షేవింగ్ తీస్తున్న‌ట్టు కొంత సేపు అత‌న్ని న‌మ్మిస్తాడు.ఇక ఆ క‌స్ట‌మ‌ర్ కూడా షేవింగ్ చేస్తున్నాడు క‌దా అన్న‌ట్టు కండ్లు మూసుకుంటాడు.అయితే ఇక్క‌డే ఆ షాపు వ్య‌క్తి క‌స్ట‌మ‌ర్ గ‌డ్డంపై రక్తంలాగా అనిపించే విధంగా ఎరుపు రంగు నీళ్ల‌ను పోస్తాడు.

ఇక ఆ త‌ర్వాత అత‌ని గడ్డంపై సీజర్‌ను ఉంచి కస్టమర్‌ను కొద్దిగా కదిలిస్తాడు.

ఇక కండ్లు తెరిచిన క‌స్ట‌మ‌ర్ రక్తాన్ని చూసి షాక్ అవుతాడు.నిజంగానే ఆ సీజ‌ర్ వ‌ల్ల త‌న పీక తెగిందేమోనని భ‌య‌ప‌డిపోయి కేకలు వేయ‌డం మ‌నం చూడొచ్చు.ఇంక త‌న ప‌ని అయిపోయింది అన్న‌ట్టు భయంతో కిండ ప‌డిపోతాడు.

కానీ అలాంటిదేమీ లేద‌ని ఆ షాపు వ్య‌క్తి చెప్ప‌డంతో ఊపిరి పీల్చుకుంటాడు.కాగా దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

ఇలా భయపెట్టించడం మంచిది కాద‌ని ఒక‌వేళ అత‌ను హార్ట్ పేషెంట్ అయి ఉంటే ప‌రిస్థితి ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Prank #Saloon Shop #Prank #Throat #Shocked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు