హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి మరి కాసేపట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు రానున్నారని తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలని సీపీఐని కోరే అవకాశం ఉంది.
అయితే పొత్తులపై కాలయాపన చేయడంపై కాంగ్రెస్ పార్టీతో సీపీఐ మండిపడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాము కూడా సీపీఎం బాటలోనే నడుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ను హెచ్చరించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే సీట్ల వ్యవహారం కొలిక్కి రాని పక్షంలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీపీఎం పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.