తెలుగులో మరో ఓటీటీ.. ఆ నిర్మాతకు బాధ్యతలు

తెలుగు సినిమా లకు ఇప్పటికే చాలా ఓటీటీలు ఉన్నాయి.ఆహా తెలుగు సినిమా లనే ప్రత్యేకంగా విడుదల చేస్తూ ఉంది.

 Sony Ott Coming With Telugu Movies And Shows-TeluguStop.com

అమెజాన్‌, హాట్ స్టార్‌, ఇంకా పలు ఓటీటీలు కూడా తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నాయి.ఇలాంటి సమయంలో మరో ఓటీటీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు కంటెంట్‌ ను అందించేందుకు గాను ప్రముఖ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ సోనీ వారు ఓటీటీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇప్పటికే సోనీ లైవ్‌ ఓటీటీ హిందీ మరియు ఇంగ్లీష్ కంటెంట్‌ ను ఇస్తున్నారు.

 Sony Ott Coming With Telugu Movies And Shows-తెలుగులో మరో ఓటీటీ.. ఆ నిర్మాతకు బాధ్యతలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారి నుండి తెలుగు కంటెంట్ రాబోతుంది.తెలుగు సినిమా లతో పాటు వెబ్‌ సిరీస్ లు మరియు హిందీ డబ్బింగ్‌ సినిమా లు ఇంకా కొన్ని షో లను తెలుగు లో డబ్బింగ్‌ చేసి మరీ స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట.

అమెజాన్‌ కంటే సోనీ లైవ్‌ కు ఎక్కువ మార్కెట్‌ స్కోప్ ఉంది.కనుక సోనీ లైవ్‌ ను తెలుగులో కూడా ప్రారంభించేందుకు సిద్దం అయ్యారు.

తెలుగు నిర్మాత మధుర శ్రీధర్‌ ఈ ప్రాజెక్ట్‌ ను పట్టబోతున్నాడు.ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మధుర శ్రీదర్‌ సారథ్యంలోని ఒక టీమ్‌ వెబ్‌ సిరీస్‌ లు మరియు వెబ్‌ మూవీస్ కోసం కథలు కూడా వింటున్నారు.

కోటి రూపాయల లోపు బడ్జెట్‌ తో వెబ్‌ సిరీస్ లు మరియు సినిమాలను కూడా నిర్మించేందుకు సోనీ వారు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.మొత్తానికి ఓటీటీ కంటెంట్‌ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు సోనీ వారు రాబోతున్నారు.

పోటీ పెరిగితే ఖచ్చితంగా మంచి కంటెంట్‌ వస్తుంది.

కనుక ఇది శుభ పరిణామం అంటూ తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అమెజాన్‌ లో షో లు చేయడం లేదు.కాని సోనీ వారు హిందీలో షో లు నిర్వహిస్తున్నారు.

కనుక తెలుగు లో కూడా షో లు చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఏదైనా ఛానెల్‌ తో ఒప్పందం చేసుకుని షో లను టెలికాస్ట్‌ చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.

#Sony TV #Sony Ott #Madhura Sridhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు