ఆ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న సోనుసూద్.. కారణం అదే!

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఎంతో మందికి తన సహాయ సహకారాలను అందిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో మందికి సహాయ సహకారాలను అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనుసూద్ మద్దతు కోసం ఎంతోమంది రాజకీయ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Sonusood Voluntarily Relinquished From Punjab State Icon Responsibilities Detail-TeluguStop.com

ఈ క్రమంలోనే సోను సూద్ సోదరి మాళవిక ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.సోను సూద్ గత ఏడాది పంజాబ్ స్టేట్ ఐకాన్ గా ఇతనిని ఎంపిక చేశారు.

అయితే ప్రస్తుతం తన సోదరి ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో సోనూసూద్ స్వచ్ఛందంగా స్టేట్ ఆఫ్ ఐకాన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నటుడు సోనుసూద్ ఎన్నికల అధికారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… అన్ని మంచి పనులు మాదిరిగానే స్టేట్ ఆఫ్ ఐకాన్ బాధ్యతలు కూడా ముగిసాయి.తానే స్వచ్ఛందంగా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికి తెలిపినట్లు సోనుసూద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం సోనుసూద్ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube