గుండెలు బ‌రువెక్కిస్తున్న సోనుసూద్ ట్వీట్‌.. ఏముందంటే..?

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో మనం చూశాం.ఆ సమయంలో ప్రభుత్వానికి సమానంగా సమాంతర ప్రభుత్వం అన్నంత స్థాయిలో కలియుగ దానవీర శూర కర్ణుడు రియల్ హీరో సోనుసూద్ పలువురికి సాయం చేశారు.

 Sonusood Tweets That Weigh Heavily On The Heart About Her Mother Birhtday-TeluguStop.com

విద్యార్థుల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ సాధ్యమైనంత మేరకు సాయం చేశాడు సోను.సెపరేట్ బస్సెస్, ఫ్లైట్స్, ట్రెయిన్స్ ఏర్పాటు చేసి మరీ వలస కూలీలను వాళ్ల సొంతూళ్లకు చేర్చాడు.

ఈ క్రమంలో ఆయన్ను అభిమానించే వారి సంఖ్య దేశవ్యాప్తంగా బాగా పెరిగింది.తాజాగా ఆయన గుండెలు బరువెక్కే ట్వీట్ ఒకటి చేశాడు.

 Sonusood Tweets That Weigh Heavily On The Heart About Her Mother Birhtday-గుండెలు బ‌రువెక్కిస్తున్న సోనుసూద్ ట్వీట్‌.. ఏముందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటో ఈ స్టోరీ చదివి మీరే తెలుసుకోండి.

తెలుగింటి అల్లుడైన సోనుసూద్ తెలుగు, తమిళ్, హిందీతో పాటు పలు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.

యాక్షన్ కింగ్ జాకీ చాన్‌తోనూ నటించాడు సోను.కాగా, ఇటీవల ఆయన ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు.

తన మాతృమూర్తి జన్మదినం సందర్భంగా ఆమెతో ఉన్న క్షణాలను గుర్తుచేసుకున్నాడు.‘అమ్మా.

నేను నీకు వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నా.మీరు నేర్పించిన లైఫ్ లెస్సన్స్‌కు థాంక్స్ అమ్మా.

అమ్మా నేను నిన్ను ఎంతో మిస్ అవుతున్నానో ఎప్పటికీ వ్యక్తపరచలేను అమ్మా.నువ్వు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని చూసినప్పుడే పూరించబడుతుంది.

మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండండి.మీరు ఎప్పటికీ నాకు మార్గదర్శకులు’ అని ఎమోషనల్ మెసెజ్‌తో ట్వీట్ చేశాడు సోనుసూద్.తల్లి పట్ల ఇంత మాత్రం ఉండటం చేతనే భరతమాత ముద్దుబిడ్డలైన ప్రజలకు సోనుసూద్ ఇంత సేవ చేయగలిగాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా, సోను తల్లి 2007లో మరణించింది.

ఇక ఈ ట్వీట్ చూసి దేశవ్యాప్తంగా ఉన్న సోను అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.అమ్మగారు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారని పేర్కొంటున్నారు.

#Corona #Sonusood #Sonusood #SonusoodTweet #Lock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు