హైదరాబాద్ లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. అసలేమైందంటే?

రియల్ హీరో సోనూసూద్ సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ మంచి పేరును సంపాదించుకుంటున్నారు.సామాన్యుల వ్యాపారాల అభివృద్ధి జరిగే విధంగా చిన్న వ్యాపారులకు మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

 Sonusood Sell Mosambi Juice Hyderabad Video Viral-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం మిల్క్ మ్యాన్ గా మారిపోయిన సోనూసూద్ తాజాగా జ్యూస్ షాప్ కు ఓనర్ గా మారిపోయి అభిమానులను ఆశ్చర్యపోయేలా చేశారు.

బంజారా హిల్స్ ఏరియాలోని రోడ్ నంబర్ 3లో ఉన్న జ్యూస్ షాప్ దగ్గరకు చేరుకున్న సోనూసూద్ అక్కడ జ్యూస్ అమ్మే వ్యక్తితో సరదాగా మాట్లాడారు.

 Sonusood Sell Mosambi Juice Hyderabad Video Viral-హైదరాబాద్ లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. అసలేమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత సొంతంగా జ్యూస్ తయారు చేసిన సోనూసూద్ అక్కడ బత్తాయి జ్యూస్ ఫ్రీ అని ప్రచారం చేసి కొంత సమయం జ్యూస్ అమ్మాడు.కొంత సమయం అక్కడే ఉన్న సోనూసూద్ చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వాలని కోరడం గమనార్హం.

తను జ్యూస్ అమ్మిన వీడియోను సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోనూసూద్ తన శైలిలో చిరు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా చేస్తున్న వీడియోలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు రియల్ హీరో సోనూసూద్ కు సినిమా ఆఫర్లు సైతం పెరుగుతుండగా ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ఆఫర్లతో ఈ హీరో బిజీగా ఉన్నారు.సోనూసూద్ కు ఇతర ఇండస్ట్రీల నుంచి పెద్ద సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

సోనూసూద్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.ఇప్పటివరకు ఏ సినీ హీరో ఖర్చు చేయని మొత్తంలో ఈ హీరో డబ్బు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ సమయంలో సమయానికి ఆదుకుని ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.

#Mosambi Juice #Sonusood #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు