తన ఫోటో పెట్టి మటన్ అమ్ముతున్న వ్యక్తికి సోనుసూద్ ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే..?!

కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బంధవుడుగా కనిపిస్తున్న రియల్ హీరో బాలీవుడ్ విలన్ సోనూ సూద్.కేవలం వ్యక్తులకే కాదు ఏకంగా ప్రభుత్వాలకు కూడా ఆయన సాపడుతున్నారు.

 Real Hero Sonusood Reaction Over A Man Selling Mutton With Sonusood Photo , Sonu-TeluguStop.com

ఈ క్రమంలో తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌కు చెందిన వ్యాపారి తన మటన్ దుకాణానికి సోనూసూద్ పేరును పెట్టారు.ఇది సోనూసూద్ దృష్టికి వ‌చ్చింది.

దీనిపై ఆయ‌న స్పందిస్తూ నేను శాఖాహారిని అటువంటిది నా పేరుపై మ‌ట‌న్ షాపు? అని చ‌మత్క‌రించాడు.ఆ తర్వాత మీ దుకాణానికి నేనేమైన స‌హాయం చేయ‌గ‌ల‌నా? అని సోనూసూద్‌ ట్వీట్‌లో ప్రశ్నించారు.కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేయ‌డం, ఇత‌ర అవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తుండ‌టం మ‌నమంతా చూస్తున్న‌దే.జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ఇటీవ‌లే తెలిపాడు.

Telugu Mutton, Corona Wave, Karminagar, Mutton Shop, Sonusood, Sonu Response, So

కర్నూలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మొద‌టి ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.అదేవిధంగా జూన్ నెలాఖ‌రులో ఏపీలోని ఆత్మ‌కూరు, నెల్లూరులో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

గ్రామీణ భార‌త‌దేశానికి మ‌ద్ద‌తునిచ్చే స‌మ‌య‌మిదని సోనూసూద్ అన్నారు.కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి తన సేవలు కొనసాగిస్తున్నాడు.మొదటి విడత కరోనా వచ్చినప్పుడు వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేశాడు.ఇప్పుడు కొనసాగుతున్న రెండవ సీజన్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు.

Telugu Mutton, Corona Wave, Karminagar, Mutton Shop, Sonusood, Sonu Response, So

క‌రోనా ప్ర‌భావం దేశంలో మొద‌ట‌గా ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ప్ర‌జ‌ల పాలిట దేవుడ‌య్యాడు.రీల్ లైఫ్‌లో విల‌న్‌గా అనేక పాత్ర‌లు పోషించిన‌ప్ప‌టికీ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం ఆయ‌న హీరో అయ్యాడు.ఇప్ప‌టికీ ఆయ‌న స‌హాయం చేస్తూనే ఉన్నారు.అవ‌స‌రం అయిన వారికి మందులు, ఆక్సిజ‌న్ సిలిండర్లు, ఇత‌ర స‌దుపాయాల‌ను అందిస్తున్నారు.అలాగే గ‌తంలో ఆయ‌న ఆర్థిక స‌హాయం అవ‌స‌రం ఉన్న‌వారికి, ఉపాధి అవ‌స‌రం ఉన్న‌వారికి స‌హాయం చేశారు.ఇది చాలా గొప్ప విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube