పొమ్మన్నవాళ్లే గౌరవించారు.. సోనూసూద్ కామెంట్స్ వైరల్..?

రియల్ హీరో సోనూసూద్ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కొరకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు.సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే సోనూసూద్ రియాక్ట్ కావడంతో పాటు వీలైనంత వేగంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

 Sonusood Latest Tweet About Star Dust Magazine,latest News Viral Socil Media-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో విలన్ గా సుపరిచితమైన సోనూసూద్ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.అయితే సోనూసూద్ తనకు ఈ స్థాయిలో గుర్తింపు, పేరు రాకముందు ఎదురైన అవమానాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ సినీ మ్యాగజైన్స్ లో స్టార్ డస్ట్ ఒకటి కాగా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ మ్యాగజైన్ ప్రచురితమవుతూ ఉండటం గమనార్హం.అయితే కొన్నేళ్ల క్రితం ఈ మ్యాగజైన్ కొరకు సోనూసూద్ ఫోటోలను పంపగా ఆ ఫోటోలు తిరస్కరణకు గురయ్యాయి.అయితే కరోనా సమయంలో చేసిన సాయాల వల్ల సోనూసూద్ కు మంచి పేరు రావడంతో స్టార్ డస్ట్ సోనూసూద్ యొక్క ఫోటోలను ప్రచురించింది.

స్టార్ డస్ట్ సంస్థ తన ఫోటోలను ప్రచురించడంపై సోనూసూద్ స్పందిస్తూ పొమ్మన్నవాళ్లే తనను గౌరవించారని చెప్పుకొచ్చారు.

తన ఫోటోను ముద్రించిన స్టార్ డస్ట్ కు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.మరోవైపు సోనూసూద్ కొరియర్ల ద్వారా కూడా ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు.

మరోవైపు సోనూసూద్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సోనూసూద్ హీరో పాత్రల్లో కూడా రాబోయే రోజుల్లో నటించనున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.క్రిష్ దర్శకత్వంలో సోనూసూద్ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రిష్ లేదా సోనూసూద్ స్పందిస్తే మాత్రమే వైరల్ అయిన వార్త నిజమో కాదో తెలిసే అవకాశాలు ఉంటాయి.

సోనూసూద్ హీరో పాత్రల్లో నటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube