వామ్మో..! సోనూసూద్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అసలు ఉహించలేదుగా..!

సోనూసూద్‌. ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

 Sonusood Funny Entertainment Treat To Fans With Dumbells, Sonu Sood, Workout, Vi-TeluguStop.com

కరోనా వైరస్ పేరు వింటే ఎంత భయపడి పోతామో, అలాగే సోనూ పేరు వింటే చాలు అంత సంబర పడిపోతాము.కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే సోనూ మాత్రం కరోనా వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి తన వంతు సహాయం చేసి సినిమాల్లో మాత్రమే నేను హీరోను కాదు రియల్ లైఫ్ లో కుడా నేను నిజమైన హీరోను అని నిరూపించుకున్నాడు.

సోనులో ఒక కళాకారుడు మాత్రమే కాదు.ఒక గొప్ప సంఘసేవ కర్త కూడా ఉన్నాడని కరోనా కాలంలో చాలామంది ప్రజలకు తెలిసింది.

అయితే ఈ క్రమంలోనే సోనూకు అభిమానులు కూడా ఎక్కువై పోయారు.

ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియాలో సోనూని ఫాలో అవుతూ ఉంటారు.

అయితే సోనూ ఇప్పుడు తన అభిమానులకు ఒక ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి.సోనూ చేసిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటంతో పాటు అభిమానులను ఫుల్ గా నవ్వించేసింది మరి.అసలు ఇంతకీ సోనూ ఏమి ఫీట్ చేసాడో తెలుసుకుందామా.మరి ఇంతకి సోనూసూద్‌ చేసిన ఈ ఫన్నీ వీడియో ఏంటంటే.

రెండు డంబెల్స్ పై సోనూసూద్‌ చేతులతో ప్రెజర్ పెట్టి కాళ్లు పైకెత్తి తలక్రిందులుగా వర్కౌట్‌ చేస్తున్నాడు.అంటే తల కిందకు కాళ్ళు పైకెత్తి నిలబడి మరి వర్కౌట్ చేస్తున్నాడు.

అలాగే సోనూ పక్కన ఓ వ్యక్తి చైర్‌ పై కూర్చొని సోనూసూద్‌ ని చూస్తూ ఉంటాడు.

ఇలా మొదటి సోనూ చేసిన ఫీట్ చూసి అభిమానులు వారెవ్వా అనుకునేలోపే మరొక ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచేశాడు.వెంటనే ఫ్లోర్‌ పై నుంచి దర్జాగా లేచి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.అలాగే సోనూ పక్కన చైర్‌ పై కూర్చొన్న వ్యక్తి కూడా ఫ్లోర్‌ పై నుంచి వెళ్లిపోయాడు.

అది చూసిన అభిమానులు షాక్ నుంచి తేరుకుని పగలబడి మరి నవ్వుతున్నారు.నిజానికి సోనూసూద్‌ ఈ ఫీట్ అంతా ఫ్లోర్‌ పైనే చేశారు.మొదట కష్టం అని చూపించి తరువాత అసలు ట్విస్ట్ బయటపెట్టారు.సోనులో ఈ ఫన్నీ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సోనుకు సంబంధించిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇకపోతే సోనూసూద్ ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్స్ లో నటిస్తున్నాడు సోనూసూద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube