బాలీవుడ్ లోకి క్రాక్ మూవీ.. హీరో ఎవరంటే..?

రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.ఐదు రోజుల్లోనే క్రాక్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వచ్చాయి.

 Real Hero Sonusood In Krack Movie Hindi Remake, Sonusood,krack Movie , Krack-TeluguStop.com

రాజా ది గ్రేట్ సినిమా తరువాత సరైన హిట్ లేని రవితేజకు క్రాక్ సినిమా రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.అయితే ఈ సినిమా హిందీలోకి రీమేక్ కానుందని తెలుస్తోంది.
2021 సంవత్సరంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రాక్ ను స్టార్ హీరో సోనూసూద్ హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి ఎంతోమంది పేద ప్రజలకు తన వంతు సహాయం చేస్తూ సోనూసూద్ వార్తల్లో నిలుస్తున్నారు.

పేదలకు ఆర్థిక సాయం చేయడం కోసం సోనూసూద్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.హిందీలో సోనూసూద్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

Telugu Bollywood, Hindi, Krack, Sonusood, Sonusoodkrack-Latest News - Telugu

క్రాక్ సినిమా నిర్మాత మధును ఇప్పటికే సోనుసూద్ హిందీ రీమేక్ హక్కుల కొరకు సంప్రదించారని తెలుస్తోంది.ఇప్పటివరకు విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ కొన్ని రోజుల క్రితం పాజిటివ్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.సోనూసూద్ ఈ నెల 14న విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో కీలక పాత్రలో నటించగా ఆచార్య సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

క్రాక్ సినిమా రీమేక్ లో సోనూసూద్ హీరోగా నటిస్తే ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారో లేక మరో వ్యక్తి దర్శకత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది.

అయితే క్రాక్ రీమేక్ లో సోనూసూద్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇప్పటికే టాలీవుడ్ సినిమాల్లో కొన్ని సినిమాలు హిందీలో రీమేక్ కావడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube