హ్యాట్సాఫ్ : వారి కోసం అరుంధతి విలన్ ఏం చేస్తోన్నాడంటే...

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినటువంటి అరుంధతి చిత్రంలో విలన్ పశుపతి పాత్రలో నటించిన సోనూసూద్ తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టాడు.అంతేగాక టాలీవుడ్లో విలన్ పాత్రలు చేస్తూ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Sonu Sudh, Tollywood Vilain, Arundathi, Corona Virus, Kodi Rama Krishna, Hotel,-TeluguStop.com

అయితే సోనూసూద్ ఒక్క తెలుగులోనే కాక హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా బాగానే రాణించాడు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా విలన్ సోనూసూద్ కూడా వైద్యులు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు తదితరులు ఎవరైనా సరే తనకు సంబంధించినటువంటి జూహి  బీచ్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ లో విశ్రాంతి తీసుకోవచ్చని, అంతేగాక వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకు సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు కానీ లాక్ డౌన్ సమయంలో కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వైద్యులు పారిశుద్ధ కార్మికులు పోలీసులు తదితరులకు సహాయం అందించడం చాలా మంచి పని అంటూ సోను సూద్ ని ప్రశంసిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనూసూద్  విలన్ పాత్రలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.అయితే ఈయన నటిస్తున్నఅటువంటి కొన్ని చిత్రాల చిత్రీకరణ కరోనా వైరస్ కారణంగా కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిపివేశారు  దీంతో సోను సూద్ కూడా తన నివాసాయానికి పరిమితమయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube